తూర్పు లద్దాఖ్‌లోని సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో భారత్‌పై మరోమారు విమర్శలు చేసింది చైనా. భారత బలగాలే అక్రమంగా వాస్తవాధీన రేఖను దాటి.. ద్వైపాక్షిక ఒప్పందాలు, ఇరుదేశాల మధ్య కుదిరిన కీలక ఏకాభిప్రాయాలను ఉల్లంఘించాయని ఆరోపించారు ఆ దేశా విదేశాంగ ప్రతినిధి హువా చునైంగ్. ఉద్రిక్తతలను తగ్గించేందుకు చర్యలు చేపట్టాలని కోరారు.
సరిహద్దులో చైనా బలగాల కార్యకలాపాలను తిప్పికొట్టామని భారత్ పేర్కొంది. భారత దళాలే మొదటగా అక్రమంగా వాస్తవాధీన రేఖను దాటి యథాతథ స్థితిని మార్చాయని ఆ ప్రకటనతోనే తెలుస్తోంది. ద్వైపాక్షిక ఒప్పందాలు, ఏకాభిప్రాయాలను భారత్ ఉల్లంఘించింది. సరిహద్దులో బలగాలు క్రమశిక్షణగా మెలుగుతూ, రెచ్చగొట్టే చర్యలు మానుకునుకోవాలని భారత్‌ను కోరుతున్నాం. ఎల్ఏసీ వెంబడి అక్రమ చొరబాట్లకు పాల్పడిన వారిని వెనక్కి రప్పించాలి. ఉద్రిక్తతలు పెంచుతూ..సమస్యను మరింత క్లిష్టంగామార్చే చర్యలను మానుకోవాలి.
-హువా చునైంగ్, చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి
ఇరు దేశాల మధ్య కుదిరిన ఒప్పందాలు, ముఖ్యమైన ఏకాభిప్రాయాన్ని అమలు చేసేందుకు చైనాతో భారత్ కలిసి పనిచేస్తుదని ఆశిస్తున్నట్లు చెప్పారు హువా చునైంగ్. సరిహద్దులో ప్రశాంతతను నెలకొల్పేందుకు చర్యలు చేపట్టాలని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఇదీ చూడండి: ''చైనాకు భారత్ షాక్' వార్తలు అవాస్తవం'