ETV Bharat / international

దుబాయ్​లో భారతీయుడికి జాక్​పాట్​- ఏం వచ్చిందంటే - దుబాయ్​ లాటరీలు

దుబాయ్​లో భారతీయుడిని అదృష్టం వరించింది. దుబాయ్​ డ్యూటీ ఫ్రీ లాటరీ టికెట్​ను కొన్న అతను.. ఓ విలాసవంతమైన కారును గెలుచుకున్నాడు. గతనెల కుమారుడి పేరుమీద తీసిన లాటరీలో కోటి రూపాయలకు పైగా సొంతం చేసుకున్నాడు మరో భారతీయుడు.

Indian hits the jackpot in Dubai raffle
దుబాయ్​లో భారతీయుడికి జాక్​పాట్​
author img

By

Published : Mar 3, 2020, 10:54 AM IST

దుబాయ్​ లాటరీలో భారతీయుడు జాక్​పాట్​ కొట్టేశాడు. సయ్యద్​ అనే వ్యక్తి విలాసవంతమైన 'బీఎండబ్ల్యూ-750ఎల్​ఐ ఎక్స్​డ్రైవ్​ ఎంస్పోర్ట్(మినరల్​ వైట్)​​' కారును సొంతం చేసుకున్నాడు.

చెన్నైకు చెందిన సయ్యద్​ 30 ఏళ్లుగా దుబాయ్​లో నివాసముంటున్నాడు. రవాణా వ్యాపారం చేసే సయ్యద్​ ఫిబ్రవరి 29న జరిగిన డబ్ల్యూటీఏ-పురుషుల డబుల్స్​ టెన్నిస్​ సెమీఫైనల్​ మ్యాచ్​ సందర్భంగా ఓ లాటరీ టికెట్ కొన్నారు. డ్రాలో విలాసవంతమైన కారు గెలుచుకున్నాడు.

'నెలారంభంలోనే మంచి శుభవార్త విన్నాను. ఇంతటి గొప్ప బహుమతినిచ్చిన దుబాయ్​ డ్యూటీ ఫ్రీకి కృతజ్ఞతలు.'

- సయ్యద్, దుబాయ్ వ్యాపారి

ఈ లాటరీలో విజేతల వివరాలను టెన్నిస్​ ప్రపంచ ఛాంపియన్​ జకోవిచ్ ప్రకటించాడు. ప్రపంచ నంబర్​వన్​ జకోవిచ్ ఈ టోర్నమెంట్​ గెలిచి తన కెరీర్​లో ఐదో దుబాయ్​ టైటిల్​ను ఖాతాలో వేసుకున్నాడు.

ఇదీ చదవండి: ఎవరీ తాలిబన్లు? వారి కథేంటి?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.