ETV Bharat / international

అక్టోబర్-డిసెంబర్ మధ్య భారత్​కు ఎస్​-400 - India will receive S-400s in October-December

భారత అమ్ముల పొదిలోకి త్వరలోనే అత్యాధునిక గగనతల రక్షణ వ్యవస్థ ఎస్​-400 చేరనుంది. రష్యాతో చేసుకున్న ఒప్పందం మేరకు తొలి బ్యాచ్​ ఈ ఏడాది అక్టోబర్​-డిసెంబర్​ మధ్య అందిస్తామని తెలిపారు ఆ దేశ రక్షణ రంగ అధికారులు.

S-400s
ఎస్​-400 క్షిపణి
author img

By

Published : May 21, 2021, 6:16 AM IST

అత్యాధునిక గగనతల రక్షణ వ్యవస్థ ఎస్​-400 తొలి బ్యాచ్​ ఈ ఏడాది అక్టోబర్​-డిసెంబర్​ మధ్య భారత్​కు అందనుంది. ఎస్​-400 కొనుగోలు ఒప్పందం ప్రకారమే ప్రక్రియ పూర్తవుతుందని రష్యా ఆయుధ ఎగుమతి సంస్థ 'రోసోబోరోన్​ ఎక్స్​పోర్ట్​' సంస్థ సీఈఓ అలెగ్జాండర్​ మిఖాయేవ్​ తెలిపారు.

రక్షణ రంగంలో కీలక ఆయుధ సామగ్రిని రష్యా నుంచి కొనుగోలు చేసేందుకు భారత్​ ప్రాధాన్యమిస్తోంది. ఈ నేపథ్యంలో రష్యా నుంచి ఎస్​-400 గగనతల రక్షణ వ్యవస్థను కొనుగోలు చేసుకునేందుకు 2018, అక్టోబర్​లో ఒప్పందం కుదుర్చుకుంది. 5 క్షిపణుల కొనుగోలు కోసం.. 500 కోట్ల​ డాలర్లను ఖర్చు చేయనుంది భారత్​. ఇప్పటికే గతేడాది 800 మిలియన్​ డాలర్లను రష్యాకు చెల్లించింది.

ఎస్​-400 అనేది రష్యాకు చెందిన అత్యాధునిక దీర్ఘశ్రేణి ఉపరితలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను ఛేదించే వ్యవస్థగా పిలుస్తారు. ట్రయాంఫ్​ ఇంటర్​సెప్టర్​ ఆధారిత క్షిపణి వ్యవస్థ.. 400 కిలోమీటర్ల దూరంలోని శుత్రు విమానాలు, క్షిపణులు, డ్రోన్లను ధ్వంసం చేయగలదు.

ఇదీ చదవండి: కాల్పుల విరమణవైపు ఇజ్రాయెల్​- పాలస్తీనా అడుగులు!

: అరుణాచల్​ప్రదేశ్​ సమీపంలో చైనా 'రహదారి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.