ETV Bharat / international

'మయన్మార్​పై 'ఆసియాన్​' కృషి అభినందనీయం' - myanmar and india latest news

మయన్మార్​లో నెలకొన్న హింసను రూపుమాపేలా ఆసియాన్ దేశాలు చేపట్టిన చొరవను భారత్​ స్వాగతించింది. ఆ దేశంలో శాంతిని పునురుద్ధరించడంలో తాము నిర్మాణాత్మక పాత్ర పోషిస్తామని స్పష్టం చేసింది.

asean countries
ఆసియాన్ దేశాల సదస్సు
author img

By

Published : Apr 25, 2021, 9:39 PM IST

మయన్మార్​లో సైనిక తిరుగబాటుతో నెలకొన్న అనిశ్చితిని అంతం చేసే దిశగా ఆసియాన్​ దేశాలు చేపట్టిన చర్యను భారత్​ స్వాగతించింది. మయన్మార్‌లో ప్రస్తుత పరిస్థితిని పరిష్కరించడంలో తాము నిర్మాణాత్మక, అర్థవంతమైన పాత్ర పోషిస్తామని పేర్కొంది. ఈ మేరకు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందమ్​ బాగ్చి తెలిపారు.

"ఏప్రిల్ 24న జరిగిన ఆసియాన్ శిఖరాగ్ర సమావేశంలో మయన్మార్​లో హింసను అంతం పలికే దిశగా ఆసియాన్ దేశాలు చూపిన చొరవను మేము స్వాగతిస్తున్నాము. ఈ ప్రయత్నాలను బలోపేతం చేసేలా.. మయన్మార్​తో మేం సంప్రదింపులు జరుపుతాం. మయన్మార్​ ప్రజలకు భారత్​ ఓ ఆత్మీయ నేస్తం. మయన్మార్​లో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్తతలను రూపుమాపేలా.. నిర్మాణాత్మకమైన, అర్థవంతమైన చర్చలు జరుపుతాం. "

-అరిందమ్​ బాగ్చి, విదేశాంగ శాఖ ప్రతినిధి

మయన్మార్​లో హింసను అంతం చేయటం సహా ఐదు అంశాలపై ఏకాభిప్రాయాన్ని ఆసియాన్ దేశాలు శనివారం విడుదల చేశాయి.

700 మంది మృతి!

ఫిబ్రవరి 1న తిరుగుబాటు చేసి ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని కూలదోసింది మయన్మార్​ సైన్యం. ఈ తిరుగుబాటుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలు జరుగుతున్నాయి. వీటిని అణచివేసేందుకు సైన్యం కఠిన చర్యలు చేపడుతోంది. సొంత పౌరులపైనే కాల్పులకు తెగబడుతోంది. ఇప్పటివరకు భద్రతా దళాల కాల్పుల్లో 700 మంది నిరసనకారులు చనిపోయినట్లు అంచనా.

ఇదీ చూడండి: కొవిడ్ ఆస్పత్రిలో ప్రమాదం- 82 మంది మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.