తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న పాకిస్థాన్.. సరిహద్దు ఉగ్రవాద చర్యలకు వత్తాసు పలకడం మానుకోవాలని భారత్ పేర్కొంది. తమ దేశంలోని మైనారిటీ, ఇతర వర్గాల మానవ హక్కుల ఉల్లంఘనకు ముగింపు పలకాలని తెలిపింది. 46వ మానవ హక్కుల మండలిలో.. పాక్ ప్రతినిధి చేసిన వ్యాఖ్యలకు భారత్ ఈవిధంగా జవాబిచ్చింది. భారత్‌కు వ్యతిరేకంగా చేసిన ఆరోపణలను తప్పుపట్టింది.
"ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పాక్ లాంటి దేశం.. సరిహద్దుల్లో ఉగ్రవాద చర్యలు, మానవ హక్కుల ఉల్లంఘనకు ముగింపు పలకాలి. ఉగ్రవాద ముఠాలకు పాక్ ప్రభుత్వం నిధులు సమకూర్చిన విషయం అందరికీ తెలుసు. అతిపెద్ద ఉగ్రముఠాలకు పాక్ స్థావరం ఇస్తున్నట్లు ఐరాస కూడా గుర్తించింది."
-పవన్ కుమార్, భారత దౌత్యవేత్త.
పాక్ ఉగ్రవాద స్థావరంగా మారినట్లు ఆ దేశ నేతలు కూడా ఒప్పుకున్నారని పవన్ వ్యాఖ్యానించారు. మైనారిటీల హక్కులను హరించడంపై పాకిస్థాన్‌ను 'మానవ హక్కుల మండలి' ప్రశ్నించాలని పేర్కొన్నారు. కశ్మీర్ గురించి ప్రశ్నించే హక్కు పాక్‌కు లేదని గుర్తుచేశారు.
ఇదీ చదవండి: