'కరోనాపై పోరులో లోపాలను కప్పిపుచ్చుకునేందుకు భారత్.. ముస్లింలను లక్ష్యంగా చేసుకుందన్న' పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ వ్యాఖ్యలను కేంద్రప్రభుత్వం తిప్పికొట్టింది. కరోనా వ్యాప్తిని అడ్డుకోవడానికి బదులు.. పొరుగుదేశాలపై ఆరోపణలు చేస్తోందని దాయాదిపై మండిపడింది.
నిరాధార ఆరోపణలు చేయొద్దు..
"పాకిస్థాన్‌లో కరోనా వ్యాప్తిని అడ్డుకోలేకపోయిన ఇమ్రాన్‌ఖాన్ భారత్‌ను తప్పుపట్టడం సరికాదు. తమ అంతర్గత సమస్యలను సరిచేసుకోలేని వారు పొరుగు దేశంపై నిరాధార ఆరోపణలు చేయడం భావ్యం కాదు."
- అనురాగ్ శ్రీవాస్తవ, భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి
మైనారిటీల విషయానికొస్తే..
భారత్‌లో మైనారిటీల సమస్యల గురించి ఇమ్రాన్‌ఖాన్ మాట్లాడడాన్ని శ్రీవాస్తవ తప్పుపట్టారు. పాక్ ముందు తన దేశంలోని మైనారిటీ వర్గాలు ఎదుర్కొంటున్న వివక్షపై, సమస్యలపై దృష్టి కేంద్రీకరించాలని హితవు పలికారు.
ఇదీ చూడండి: సోమవారం నుంచి లాక్డౌన్ సడలింపులు.. కానీ...