ETV Bharat / international

'క్వాడ్​' మంత్రుల భేటీలో చైనాపైనే ప్రధాన చర్చ! - జై శంకర్

భారత్​ సహా మూడు క్వాడ్​ సభ్య దేశాల మధ్య విదేశాంగ మంత్రుల స్థాయిలో మూడవ సమావేశం జరిగింది. కరోనా, అంతర్జాతీయ భద్రత సహా చైనా దురాక్రమణల కట్టడిపై ప్రధానంగా చర్చించినట్లు సమాచారం.

India participates in 3rd Australia-Japan-USA Quad ministerial meeting
చైనాకు చెక్​ పెట్టే దిశగా 3వ క్వాడ్ సమావేశం
author img

By

Published : Feb 19, 2021, 5:56 AM IST

చైనా సైనిక విస్తరణవాదం పెరుగుతున్న వేళ అంతర్జాతీయ నిబంధనలకు కట్టుబడి పనిచేయాలని చతుర్ముఖ కూటమి (క్వాడ్) దేశాలు నిర్ణయించాయి. ప్రాదేశిక సమగ్రత, సార్వభౌమత్వాన్ని గౌరవించడం, స్వేచ్ఛా నౌకాయానం సహా వివాదాల శాంతియుత పరిష్కారానికి అంగీకరించాయి. ఈ మేరకు గురువారం వర్చువల్​గా సభ్యదేశాలైన భారత్, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్​ల మధ్య 3వ క్వాడ్​ దేశాల మంత్రుల స్థాయి సమావేశం జరిగింది.

ఈ భేటీలో భారత్ నుంచి విదేశాంగ మంత్రి ఎస్​ జైశంకర్, అమెరికా విదేశాంగ కార్యదర్శి ఆంటోనీ బ్లింకెన్, ఆస్ట్రేలియా, జపాన్ విదేశాంగ మంత్రులు మారిసే పేన్, తోషిమిత్సు మోతెగి పాల్గొన్నారు. కొవిడ్​ పోరుపై ప్రత్యేక దృష్టి సారించినట్లు మంత్రి జై శంకర్ చెప్పారు. వ్యాక్సినేషన్​తో పాటు వైద్యం, వైద్య పరికరాల్లో పరస్పర సహకారానికి అంగీకరించినట్లు తెలిపారు.

మయన్మార్​లో రాజకీయ సంక్షోభం, కరోనా మహమ్మారి, వాతావరణ మార్పులు, సముద్ర భద్రత, సరఫరా గొలుసు పునరుద్ధరణ, ఉగ్రవాద నిరోధకత తదితర అంశాలపై సమావేశంలో చర్చించినట్లు విదేశాంగ శాఖ తెలిపింది. ఇండో పసిఫిక్ నిర్వహణ ఉద్దేశానికి ఐరోపా సహా ప్రపంచ దేశాల మద్దతు లభించిందని పేర్కొంది.

ఇదీ చూడండి: పాక్​ తెలివిగా ప్లాన్​ చేసింది కానీ..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.