ETV Bharat / international

అఫ్గాన్‌ సమస్యపై చర్చ.. భారత్‌కు అందని ఆహ్వానం

అఫ్గాన్​లో తాజాగా జరిగుతున్న పరిణామాలపై చర్చించేందుకు ఏర్పాటైన కూటమి సమావేశానికి భారత్​కు ఆహ్వానం అందలేదు. అఫ్గాన్‌లో శాంతి పరిరక్షణ కృషి చేస్తోన్న భారత్​ను విస్మరించి.. జరుగుతున్న ఈ సమావేశంలో అమెరికా, చైనా, పాక్‌ పాల్గొంటున్నాయి.

అఫ్గాన్‌ సమస్య
అఫ్గాన్‌ సమస్య
author img

By

Published : Aug 6, 2021, 5:55 AM IST

అఫ్గానిస్థాన్‌లో వేగంగా మారుతున్న పరిణామాల నేపథ్యంలో.. ఈ నెల 11న రష్యా నిర్వహించతలపెట్టిన కీలక సమావేశానికి భారత్‌కు ఆహ్వానం అందలేదు. 'ఎక్స్‌టెండెడ్‌ ట్రొయికా' పేరుతో ఖత్తార్‌లో నిర్వహించే ఈ భేటీలో పాకిస్థాన్‌, చైనా, అమెరికా పాల్గొంటాయని సంబంధిత వర్గాలు గురువారం వెల్లడించాయి. అఫ్గాన్‌లో తాలిబన్ల దాడులు పెరిగిపోతున్న తరుణంలో అక్కడ హింసను రూపుమాపి శాంతియుత వాతావారణాన్ని ఏర్పరిచేందుకు రష్యా ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా అన్ని అఫ్గాన్‌తో సంబంధాలున్న అన్ని భాగస్వామ్య దేశాల సాయం తీసుకోబోతున్నట్లు గతంలో ప్రకటించింది.

అఫ్గాన్‌లో శాంతి పరిరక్షణ కోసం భారత్‌ కూడా కృషి చేస్తోంది. యుద్ధంతో నష్టపోయిన ఆ దేశంలో పునర్నిర్మాణం, సహాయక కార్యక్రమాల కోసం సుమారు 300 కోట్ల డాలర్లు వెచ్చించింది. అఫ్గాన్‌లో పరిస్థితిని చక్కదిద్దే దిశగా ప్రభావం చూపగల దేశాలన్నింటితోనూ కలసి పనిచేస్తామని, భారత్‌ కూడా అందులో ఉందని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లవ్రోవ్‌ గత నెలలో చెప్పారు. దీంతో తదుపరి సమావేశంలో భారత్‌ భాగస్వామ్యం కూడా ఉంటుందని భావించారు. కానీ రష్యా ఆ దిశగా నిర్ణయం తీసుకోలేదు. తాలిబన్లకు సహకారం అందిస్తున్న పాక్‌కు ఈ సమావేశాల్లో స్థానం కల్పించడంపై రష్యా వద్ద భారత్‌ అభ్యంతరం వ్యక్తం చేసిందని, అందుకే రష్యా.. భారత్‌కు ఆహ్వానం పంపలేదని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. దీనిపై భారత్‌ ఇప్పటివరకూ స్పందించలేదు. మరోవైపు శుక్రవారం బారత్‌ అధ్యక్షతన నిర్వహించే ఐరాస భద్రత మండలి సమావేశంలో అఫ్గాన్‌ పరిస్థితిపై చర్చించనున్నట్లు ఐరాసలోని భారత రాయబారి టీఎస్‌ తిరుమూర్తి తెలిపారు.

అఫ్గాన్‌లో జరుగుతున్న ఘర్షనల కారణంగా ఇప్పటివరకూ సుమారు 3.60 లక్షల మంది నిరాశ్రయులు కావడంపై ఐరాస అధినేత ఆంటోనియో గుటెరస్‌ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే ఈ హింసకు ముగింపు పలకాలని పేర్కొన్నారు.

తాలిబన్‌ స్థావరాలపై అఫ్గాన్‌ సేనల దాడి

దక్షిణ అఫ్గాన్‌లోని తాలిబన్‌ స్థావరాలపై ఆ దేశ వాయుదళం గురువారం మరికొన్ని దాడులు చేపట్టింది. దక్షిణ హెల్మాండ్‌ ప్రావిన్సు రాజధాని లష్కర్‌ గాహ్‌లో బాంబుల వర్షం కురిపించింది. మరోవైపు తాలిబన్లు ఉత్తర అఫ్గాన్‌లో మరిన్ని ప్రాంతాలను చేజిక్కించుకున్నారు. సర్‌-ఎ-పుల్‌, జవ్జాన్‌ ప్రావిన్సులోని చాలా జిల్లాలు తాలిబన్ల వశమయ్యాయి.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.