ETV Bharat / international

'ప్రపంచ వాణిజ్యాన్ని ఆకర్షించే సత్తా భారత్​ సొంతం' - భారత్ అమెరికా వాణిజ్యం

చైనా ఏకఛత్రాధిపత్యాన్ని పక్కకు నెట్టి ప్రపంచ వాణిజ్యాన్ని ఆకర్షించే సత్తా భారత్​కు ఉందని అమెరికా విదేశాంగమంత్రి మైక్ పాంపియో అభిప్రాయపడ్డారు. విదేశీ పెట్టుబడులకు అనుకూలంగా భారత్​.. తన మార్కెట్​ను మరింత విస్తృతం చేయాలని ఆయన సూచించారు.

India can attract global supply chains away from China: Pompeo
ప్రపంచ వాణిజ్యాన్ని ఆకర్షించే సత్తా భారత్​కు ఉంది: పాంపియో
author img

By

Published : Jul 22, 2020, 10:08 PM IST

అమెరికా సహా ప్రపంచదేశాల నమ్మకాన్ని సంపాదించిన భారత్​.. చైనాను పెక్కకునెట్టి గ్లోబల్​ వాణిజ్య శక్తిగా ఎదగగలదని యూఎస్ విదేశాంగమంత్రి మైక్ పాంపియో అభిప్రాయపడ్డారు. ఫలితంగా ప్రపంచదేశాలు చైనా కంపెనీలపై ఆధారపడడం తగ్గుతుందని ఆయన పేర్కొన్నారు.

యూఎస్ ఇండియా బిజినెస్ కౌన్సిల్ వార్షిక ఇండియా ఐడియా సమ్మిట్​లో పాంపియో మాట్లాడుతూ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.

"చైనాను పక్కకునెట్టి ప్రపంచ వాణిజ్యాన్ని ఆకర్షించే సత్తా భారత్​కు ఉంది. ముఖ్యంగా టెలికమ్యునికేషన్​, వైద్య సామగ్రి సహా పలు రంగాల్లో... ప్రపంచ అవసరాలను తీర్చే సామర్థ్యం భారత్​కు ఉంది. ఇది కచ్చితంగా ప్రపంచ దేశాలు చైనాపై ఆధారపడడాన్ని తగ్గిస్తుంది."

- మైక్ పాంపియో, అమెరికా విదేశాంగమంత్రి

భారత్​-అమెరికా వాణిజ్య బంధం

అదే సమయంలో భారత్​ తన మార్కెట్​ను ప్రపంచ పెట్టుబడులకు అనుకూలంగా సంస్కరించాల్సిన అవసరముందని పాంపియో నొక్కి చెప్పారు. ముఖ్యంగా అమెరికా సంస్థలు భారత్​లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు, వాణిజ్యం చేసేందుకు అవకాశం కల్పించాలని సూచించారు.

ఈ సందర్భంగా అమెరికా ఆతిథ్యం ఇవ్వనున్న తదుపరి జీ-7 శిఖరాగ్ర సదస్సుకు భారత ప్రధాని నరేంద్రమోదీని ఆహ్వానించిన విషయాన్ని మైక్ పాంపియో గుర్తుచేశారు. ఏది ఏమైనా భారత్​-అమెరికా భాగస్వామ్యం మరింత బలపడుతుందనే నమ్మకముందని ఆయన పేర్కొన్నారు.

కలిసి పనిచేద్దాం..

చైనా కమ్యూనిస్టు పార్టీ నుంచి సవాళ్లు ఎదురవుతున్న వేళ... భారత్​-అమెరికా లాంటి ప్రజాస్వామ్య దేశాలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని పాంపియో అభిప్రాయపడ్డారు.

చైనా మేధో సంపత్తి చౌర్యానికి పాల్పడుతోందని... పాంపియో మరోసారి విమర్శలు గుప్పించారు. ఇలాంటి తరుణంలో మేధో హక్కుల పరిరక్షణకు భారత్-అమెరికాలు కలిసి పనిచేయాలని ఆయన అభిలషించారు.

ఇదీ చూడండి: 'భారత్​లో పెట్టబడులకు ఇదే మా అహ్వానం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.