వచ్చే వారం బంగ్లాదేశ్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన సందర్భంగా ఇరుదేశాల మధ్య మూడు ఒప్పందాలు కుదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి. బంగ్లాదేశ్ జాతిపిత షేక్ ముజీబుర్ రెహ్మాన్ జయంతి నేపథ్యంలో 17 నుంచి 27 వరకు దేశమంతటా గోల్డెన్ జూబ్లీ వేడుకలు ఘనంగా నిర్వహించాలని బంగ్లాదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ వేడుకలకు హాజరు కావాలని భారత ప్రధానిని బంగ్లా ప్రభుత్వం కోరింది. అందుకు ప్రధాని కార్యాలయం అంగీకరించింది.
మోదీ తన పర్యటనలో భాగంగా బంగ్లా ప్రధాని షేక్ హసీనాతో సమావేశమై పలు అంశాలపై చర్చిస్తారని ఆ దేశ విదేశాంగ మంత్రి ఏకే అబ్దుల్ మోమెన్ అన్నారు. విపత్తు నిర్వహణతో పాటు పలు సంస్థల మధ్య సహకారానికి ఇరుదేశాలు అవగాహన ఒప్పందాలు కుదుర్చుకోనున్నాయని ఆయన పేర్కొన్నారు.
గోల్డెన్ జూబ్లీ వేడుకలను వీక్షించేందుకు నేపాల్, శ్రీలంక, మాల్దీవులు, భూటాన్ ప్రభుత్వాధినేతలు వేరువేరు సమయాల్లో హజరుకానున్నారు.
ఇదీ చూడండి: 'ఆరోపణలు అవాస్తవం.. మా టీకా సేఫ్'