ETV Bharat / international

సరిహద్దు ప్రతిష్టంభనపై భారత్​, చైనా కీలక నిర్ణయం - తూర్పులద్ధాఖ్​లో బలగాలు ఉపసంహరణ

వాస్తవాధీన రేఖ వెంబడి అన్ని ప్రాంతాల్లో బలగాల ఉపసంహరణ కోసం మరోసారి చర్చలు జరపాలని భారత్, చైనా నిర్ణయించాయి. తద్వారా పరస్పరం ఆమోదయోగ్యమైన పరిష్కారం కనుగొనాలని ఇరు దేశాలు భావిస్తున్నాయి.

India and China
భారత్​, చైనా చర్చలు
author img

By

Published : Jun 25, 2021, 9:36 PM IST

తూర్పు లద్ధాఖ్​లోని వాస్తవాధీన రేఖ వెంబడి మిగతా ప్రాంతాల్లో బలగాల ఉపసంహరణ ప్రక్రియను చేపట్టే విషయంలో.. భారత్​, చైనాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. చర్చల ద్వారా.. పరస్పర ఆమోదయోగ్యమైన పరిష్కారం కనుగొనాలని శుక్రవారం నిర్ణయించాయి. ఈ మేరకు ఇరుదేశాల దౌత్యవేత్తల మధ్య జరిగిన సమావేశంలో నిర్ణయం తీసుకున్నామని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది.

"తూర్పులద్ధాఖ్​లోని వాస్తవాధీన రేఖ వెంబడి మిగతా ప్రాంతాల్లో బలగాల ఉపసంహరణ కోసం..12వ విడత సైనిక చర్చలు త్వరలో నిర్వహించేందుకు ఇరు దేశాలు అంగీకరించాయి. గతేడాది ఇరు దేశాల విదేశాంగ మంత్రులు మధ్య కుదిరిన ఒప్పందాన్ని దృష్టిలో ఉంచుకుని తూర్పు లద్దాఖ్​లో ఎల్​ఏసి వెంట మిగిలిన సమస్యలకు పరిష్కారం కనుగొనడానికి అంగీకరించాయి."

-భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ

వర్కింగ్ మెకానిజమ్‌ ఫర్‌ కన్సల్టేషన్ అండ్‌ కో-ఆర్డినేషన్(డబ్ల్యూఎంసీసీ) ఆధ్వర్యంలో ఈ దౌత్య వేత్తల సమావేశం జరిగింది.

చైనా-భారత్ సరిహద్దు ప్రాంతమైన తూర్పు లద్ధాఖ్​లోని గల్వాన్‌ లోయలో ఇరు దేశాల సైనికుల పరస్పర ఘర్షణలకు ఏడాది పూర్తయింది. 2020 జూన్‌ 15న జరిగిన ఈ ఘర్షణలల్లో ఇరువైపులా ప్రాణనష్టం జరిగింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో బలగాల ఉపసంహరణకు ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిరినప్పటికీ అది పూర్తిస్థాయిలో అమలుకు నోచుకోలేదు.

ఇదీ చూడండి: 'ద్వైపాక్షిక సంబంధాలను సరిహద్దుతో ముడిపెట్టొద్దు'
ఇదీ చూడండి: Galwan Clash: భారత్​ నేర్వాల్సిన పాఠాలు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.