భారత్‌లో మాదిరే పొరుగు దేశం పాకిస్థాన్‌లోనూ చమురు ధరలు(Pakistan petrol price) ఆకాశాన్నంటుతున్నాయి. అక్కడ లీటర్ పెట్రోల్ ధర సుమారు రూ. 138పైనే. శుక్రవారం ఒక్కరోజే లీటరుకు రూ. 8.14 చొప్పున పెంచుతున్నట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
పంచదార కంటే తక్కువే..
అయితే.. ఇదే వారి ప్రధాన సమస్య కాదు. నిత్యావసరాలు కొనుక్కునేందుకు అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దేశంలో కిలో పంచదార (Pakistan sugar rate) రూ. 150కిపైనే అమ్ముడవుతోంది. నగరాలను బట్టి కాస్త హెచ్చుతగ్గులు ఉన్నాయి.
నిత్యావసరాల ధరలు తగ్గిస్తామని ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం హామీ ఇచ్చినప్పటికీ.. రేటు అమాంతం పైపైకి పోతూనే ఉంది.
పెషావర్‌లోని హోల్‌సేల్ మార్కెట్లో కిలో చక్కెర (Pakistan sugar rate today).. రూ. 8 మేర పెరిగింది. కిలో చక్కెర హోల్‌సేల్ రేటు రూ. 140 ఉండగా.. రిటైల్‌లో రూ. 145-150 మధ్య అమ్ముతున్నారని షుగర్ డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అంటున్నారు.
అయితే.. లాహోర్‌లో గురువారం చక్కెర ధర (Sugar rate in Pakistan) రూ.126 ఉండగా, అక్రమంగా లాభాలు పొందేందుకు డీలర్లే కృత్రిమ కొరతను సృష్టించి ఒక్కసారిగా రేట్లు పెంచారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఇవీ చూడండి: చేజేతులారా ఆహార సంక్షోభంలోకి జారుకున్న చైనా!