కశ్మీర్ విషయంలో భారత ప్రభుత్వ నిర్ణయంపై పాకిస్థాన్ విషం కక్కుతూనే ఉంది. అంతర్జాతీయంగా ఈ విషయాన్ని పెద్దది చేసేందుకు కపట నాటకాలు ఆడుతోంది. తాజాగా కశ్మీర్లో పరిస్థితిపై సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్‌తో పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ ఫోన్లో సంభాషించారు.
ఈ విషయాన్ని ఆ రెండు దేశాల మీడియా స్పష్టం చేసింది. సంభాషణలో భాగంగా కశ్మీర్‌పై భారత్ నిర్ణయంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారే అవకాశం ఉందని ఇమ్రాన్ చెప్పినట్లు సమాచారం.
ఇదీ చూడండి: షోపియాన్ ప్రజలతో కలిసి భోంచేసిన ఢోబాల్