పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్.. అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. తన వ్యక్తిగత ట్విట్టర్ ఖాతాలో.. తన మొదటి భార్య జెమిమా గోల్డ్‌స్మిత్‌తో పాటు అందరినీ అన్‌ఫాలో చేశారు. అయితే ఖాన్ ఇలా చేయడం వెనుక కారణాలు ఇంకా తెలియరాలేదు. మరోవైపు ఈ వ్యవహారంపై నెట్లో ట్రోల్స్ పెరిగాయి. పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కంటే తనని తాను తక్కువ వేసుకోవడం వల్లే ఖాన్ ఈ నిర్ణయం తీసుకున్నారని ట్వీట్లు చేస్తున్నారు.
ఖాన్.. 2010 నుంచి ట్విట్టర్ ఖాతాను వినియోగిస్తున్నారు. తన మొదటి భార్య జెమిమాతో విడిపోయినా .. ఇప్పటివరకు ఆమెను ఫాలో అయ్యారు. అయితే ప్రస్తుతం ఇమ్రాన్ ఖాన్, జెమిమాను అన్‌ఫాలో చేయటాన్ని నెటిజన్లు ఇష్టపడటంలేదు.
ఇదీ చదవండి : 'ఇలా అయితే మేం పాకిస్థాన్ నుంచి వెళ్లిపోతాం!'