ETV Bharat / international

కశ్మీరీ ప్రజలకు 'రాయబారి'గా ఉంటా: ఇమ్రాన్​ఖాన్​ - జమ్ము కశ్మీర్​

కశ్మీరీ ప్రజల సమస్యలను అంతర్జాతీయ సమాజానికి తెలియజేసేందుకు తాను ఓ రాయబారిగా పనిచేస్తానని పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్​ఖాన్ వ్యాఖ్యానించారు. జమ్ము కశ్మీర్​ ప్రత్యేక హోదాను భారత ప్రభుత్వం రద్దు చేయడాన్ని ఇమ్రాన్​ఖాన్ వ్యతిరేకిస్తూ వస్తున్నారు. అయితే ఇది తమ అంతర్గత విషయమని భారత్​ ఇప్పటికే తేల్చిచెప్పింది.

Imran Khan says he would become ambassador of Kashmiri people
పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్​ఖాన్​
author img

By

Published : Jun 27, 2020, 4:14 AM IST

పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్​ఖాన్​ మరోసారి అసంబద్ధ ప్రేలాపన చేశారు. కశ్మీరీ ప్రజల సమస్యలను అంతర్జాతీయ సమాజానికి తెలియజేసేందుకు... తాను 'రాయబారి'గా ఉంటానని వ్యాఖ్యానించారు.

"నేను కాశ్మీరీ ప్రజలకు రాయబారిగా ఉంటాను. వారు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రపంచానికి తెలియజేస్తాను. ముఖ్యంగా వివిధ దేశాధినేతలతో, ప్రభుత్వాలతో జరిగే సమావేశాల్లో కశ్మీరీల సమస్యలను లేవనెత్తుతాను. "

- ఇమ్రాన్​ఖాన్, పాక్ ప్రధాని

భారత ప్రభుత్వం, 2019 ఆగస్టు 5న జమ్ము కశ్మీర్ ప్రత్యేక హోదాను రద్దు చేసి, వాటిని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించింది. దీనిని పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్​ఖాన్ తీవ్రంగా వ్యతిరేకించారు. భారత్ నిర్ణయానికి వ్యతిరేకంగా అంతర్జాతీయ మద్దతు సంపాదించడానికి ప్రయాసపడ్డారు. చివరకు ఏమీ సాధించలేక చతికిలపడ్డారు.

పాకిస్థాన్ ప్రయత్నాలను భారత్​ తీవ్రంగా ఖండించింది. ఆర్టికల్ 370 రద్దు అనేది పూర్తిగా భారత అంతర్గత విషయమని అంతర్జాతీయ సమాజానికి స్పష్టం చేసింది. ఈ నిజాన్ని అంగీకరించి, భారత వ్యతిరేక ప్రచారాన్ని ఆపాలని పాకిస్థాన్​ను హెచ్చరించింది.

ఇదీ చూడండి: చైనా సరిహద్దుల్లో రోడ్ల నిర్మాణం వేగవంతం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.