పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌పై పాకిస్థాన్ డెమొక్రటిక్ మూవ్‌మెంట్(పీడీఎం) విపక్ష కూటమి తీవ్ర విమర్శులు చేసింది. ఇమ్రాన్‌ఖాన్ అసమర్థుడని నేతలు ఆరోపించారు. పెద్ద పెద్ద నియంతలే చరిత్రలో కలిసిపోయారని ఈ కీలుబొమ్మ ప్రభుత్వం ఏం చేయగలదని ప్రశ్నించారు. తాము చేస్తున్నది నిర్ణయాత్మక పోరని తెలిపారు. 2007లో జరిగిన జంట పేలుళ్లలో మాజీ ప్రధాని బెనజీర్ భుట్టో మరణించి నిన్నటికి 13 సంవత్సరాలు గడిచింది. అందుకు గుర్తుగానూ కరాచీలో భారీ ఎత్తున ర్యాలీని నిర్వహించారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ, అనారోగ్య కారణాలతో లండన్‌లో తలదాచుకుంటున్న మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కూతరు మరియం నవాజ్ సైతం ఈ ర్యాలీలో పాల్గొని ప్రసంగించారు.
మరియమ్ నవాజ్ భర్త అరెస్ట్
పాకిస్థాన్‌లో ఏకమైన ప్రతిపక్ష పార్టీలపై ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని తెహ్రీక్- ఇ- ఇన్సాఫ్ ప్రభుత్వం ప్రతీకార చర్యలకు దిగింది. మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కూతురు పాకిస్థాన్ ముస్లిం లీగ్ నాయకురాలు మరియమ్ నవాజ్ భర్త సప్దార్ను పోలీసులు అరెస్ట్ చేశారు. కరాచీలోని ఓ హోటల్‌లో మరియమ్ దంపతులు నివాసం ఉంటున్నారు. ఆదివారం రాత్రి హోటల్ గది తలుపులు ధ్వంసం చేసి అక్రమంగా తన భర్తను పోలీసులు అరెస్ట్ చేశారని మరియమ్ ట్విట్టర్‌లో ఆరోపించారు.
విపక్షాలను అణచివేసేందుకే :
పాకిస్థాన్‌లో ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు వ్యతిరేకంగా ఏకమైన ప్రతిపక్ష పార్టీలకు మరియమ్ షరీఫ్ న్యాయకత్వం వహిస్తున్నారు. పాకిస్థాన్ ప్రజాస్వామ్య ఉద్యమం పీడీఎం పేరిట 11 పార్టీలు చేతులు కలిపి.. గత శుక్రవారం గుజ్రాన్ వాలాలో పెద్దఎత్తున నిరసన ర్యాలీ నిర్వహించాయి. ఈ నేపథ్యంలోనే విపక్షాలను అణిచేందుకు ఇమ్రాన్‌ఖాన్ ప్రభుత్వం అక్రమ అరెస్ట్‌లు చేస్తోందని ప్రతిపక్ష పార్టీలు విమర్శించాయి.