కొవిడ్-19 ప్రభావంతో ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలు బలహీనమై, సాధారణ వైద్యసేవలకు అంతరాయాలు కలుగుతున్నాయి. ఈ పరిస్థితులు శిశువుల మరణాలు పెరిగేందుకు దారితీస్తున్నాయని యునిసెఫ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.
ఈ అంశంపై లాన్సెట్ గ్లోబల్ హెల్త్ జర్నల్‌లో ప్రచురితమైన జాన్ హాప్కిన్స్ బ్లూమ్‌బర్గ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్‌హెల్త్ పరిశోధకుల అధ్యయనాన్ని ప్రస్తావించింది. తక్కువ, మధ్య ఆదాయం గల 118 దేశాల్లో రోజుకు అదనంగా 6 వేల మంది ఐదేళ్లలోపు పిల్లలు చనిపోయే ప్రమాదముందని అధ్యయనం పేర్కొంది.
బలహీన ఆరోగ్య వ్యవస్థలున్న దేశాల్లో ఇప్పటికే ఆరోగ్య సేవల గొలుసుక్రమం దెబ్బతింది. లాక్‌డౌన్‌లు, కర్ఫ్యూలు, రవాణా అంతరాయాలతో ఆస్పత్రులకు రావడం తగ్గిపోయింది. కుటుంబ నియంత్రణ, ప్రసవానంతర సంరక్షణ, పిల్లలకు టీకాలు వంటి సేవలన్నీ తీవ్రంగా ప్రభావితం అవుతున్నాయి. ఫలితంగా పసిపిల్లల మరణాలు వినాశకర పరిణామాలకు దారితీస్తున్నాయని అధ్యయనం పేర్కొంది.
ఇదీ చదవండి:మెడకు ఊయల బిగుసుకుని పదేళ్ల బాలుడి మృతి