ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుని కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్‌కు కాస్త ఊరట లభించింది. ఆ దేశానికి మూడో విడతగా చెల్లించాల్సిన 50కోట్ల డాలర్ల రుణానికి అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) ఆమోదం తెలిపింది.
39 నెలల ఎక్స్టెండెడ్ ఫండ్ ఫెసిలిటీ(ఈఎఫ్ఎఫ్) కింద.. 2019లోనే పాకిస్థాన్‌కు 600 కోట్ల డాలర్ల రుణాన్ని విడతల వారీగా ఇచ్చేందుకు ఐఎంఎఫ్ అంగీకరించింది. ఈ మేరకు తొలి రెండు విడతల్లో 145 కోట్ల డాలర్ల రుణాన్ని అందించింది. అయితే.. కరోనా వ్యాప్తి కారణంగా మూడో విడతలో జాప్యం జరిగింది.
ఇదీ చదవండి: '2036 వరకు అధ్యక్షుడిగా పుతిన్' బిల్లుకు ఆమోదం