భారత నావికాదళ మాజీ అధికారి కుల్‌భూషణ్ జాదవ్ కేసు తీర్పును నేడు ప్రకటించనుంది అంతర్జాతీయ న్యాయస్థానం. ది హేగ్‌లోని పీస్ ప్యాలెస్‌లో మధ్యాహ్నం 3 గంటలకు( భారత కాలమానం ప్రకారం సాయంత్రం 6 గంటలకు) నిర్ణయం వెలువరించనున్నారు న్యాయమూర్తి అబ్దుల్ఖవీ అహ్మద్ యూసఫ్.
2016లో కుల్‌భూషణ్ జాదవ్‌ను ఇరాన్‌లో పాక్ ఏజెంట్లు అపహరించారు. ఆ తర్వాత బలూచిస్థాన్‌లో ఆయన ప్రవేశిస్తే అరెస్ట్ చేసినట్లు ప్రకటించారు. గూఢచర్యం ఆరోపణలపై 2017 ఏప్రిల్‌లో పాకిస్థాన్ సైనిక కోర్టు ఆయనకు మరణశిక్ష ఖరారు చేసింది.
అంతర్జాతీయ న్యాయస్థానంలో సవాల్...
జాదవ్ వ్యవహారంపై భారత్ తీవ్రంగా స్పందించింది. ఇరాన్‌లో ఉంటున్న ఆయన్ను పాక్ అపహరించిందని భారత్ బలంగా వాదించింది. పాక్ విధించిన మరణశిక్షను సవాల్ చేస్తూ 2017 మే 8న అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. 2017 మే 18న ఆయన మరణశిక్షపై స్టే విధించింది కోర్టు. అప్పటి నుంచి విచారణ కొనసాగుతోంది.
గత ఫిబ్రవరిలో అత్యంత భయానక పుల్వామా ఉగ్రదాడి అనంతరం.. ఈ కేసులో విచారణ జరిగింది. భారత్, పాకిస్థాన్‌ల వాదనలు నమోదు చేసింది అంతర్జాతీయ న్యాయస్థానం(ఐసీజే).
ఇదీ చూడండి:రోషన్బేగ్పై ప్రశ్నల వర్షం... విడుదల