ETV Bharat / international

'అలా చేస్తే ఆర్మీ చీఫ్​ను తొలగించే వాడిని' - Sharif recent speeches on Kargil war

ముందస్తు సమాచారం లేకుండా భారత్​పై కార్గిల్ యుద్ధానికి పాల్పడితే సైన్యాధికారిని తొలగిస్తానని పాక్​ ప్రధాని ఇమ్రాన్​ ఖాన్​ వ్యాఖ్యానించారు. 1999 కార్గిల్​ యుద్ధంపై తనకు తొలుత ఎలాంటి సమాచారం అందలేదని మాజీ ప్రధాని నవాజ్​ షరీఫ్​ చెప్పిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారు ఇమ్రాన్​.

I would have sacked army chief if Kargil war was conducted without informing me: Imran Khan
సమాచారం లేకుండా కార్గిల్​యుద్ధం చేస్తే ఆర్మీచీఫ్​ను తొలగిస్తా
author img

By

Published : Oct 2, 2020, 10:08 PM IST

తనకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా భారత్​తో కార్గిల్​ యుద్ధానికి పాల్పడితే.. ఆర్మీ చీఫ్​ను తొలగించేవాడినని పాక్​ ప్రధాని ఇమ్రాన్​ ఖాన్​ తెలిపారు. ఓ ప్రైవేటు టీవీ ఛానెల్​కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు ఇమ్రాన్​.

1999లో నవాజ్​ షరీఫ్​ ప్రధానిగా ఉన్న సమయంలో కార్గిల్​ యుద్ధం జరిగింది. అయితే.. ఆ సందర్భంలో ఏం జరిగిందో తనకు తెలియదని షరీఫ్​ చెప్పారు. దీంతో అప్పటి ఆర్మీచీఫ్​ జనరల్​ పర్వేజ్​ ముషారఫ్​.. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండానే కార్గిల్​పై దాడికి పాల్పడ్డారని తెలుస్తోంది.

అయితే.. ఇలాంటి పరిస్థితి తనకు ఎదురైతే మాత్రం.. తక్షణమే సంబంధిత సైనిక విభాగాధిపతిని తొలగిస్తానని ఇమ్రాన్​ ఖాన్​ వెల్లడించారు.

2014లో ప్రధాని పదవి నుంచి తప్పుకోమని ఐఎస్​ఐ చీఫ్ తనపై ఒత్తిడి పెంచారని గతంలో ఆరోపించారు షరీఫ్​. దీనిపై స్పందించిన ఇమ్రాన్​.. తాను షరీఫ్​ స్థానంలో ఉండి ఉంటే.. ఐఎస్​ఐ చీఫ్​ను ఆ పదవి నుంచి తప్పించేవాడినని పేర్కొన్నారు.

మరోవైపు పాక్​ రాజకీయాల్లో ఆర్మీ జోక్యం చేసుకుంటోదన్న షరీఫ్​ వ్యాఖ్యలను ఖండించారు ఇమ్రాన్​. దేశం ఐక్యమత్యంతో ఉండటానికి ఆర్మీ కారణమన్నారు.

లిబియా, సిరియా, ఇరాక్​, అఫ్గానిస్థాన్​లతో పోలిస్తే పాక్​ శాంతియుతంగా ఉందంటే కారణం సైనికులేనని ప్రధాని అభిప్రాయపడ్డారు. ఆర్మీ లేకపోతే ఇప్పటికే దేశం మూడు ముక్కలై ఉండేదన్నారు.

ఇదీ చదవండి: ఈయూతో రేపు బ్రిటన్ 'బ్రెగ్జిట్' భేటీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.