ETV Bharat / international

కిమ్ 'కొత్త'‌ సందేశం- 1995 తర్వాత ఇదే! - కిమ్ లేఖలు

సాధారణంగా నూతన సంవత్సరం తొలి రోజున టీవీలో ప్రసంగించే ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్.. ఈసారి సంప్రదాయాన్ని పక్కనబెట్టారు. ఇందుకు భిన్నమైన పద్ధతిలో ప్రజలకు సందేశాన్ని అందించారు. ఓ కొరియా నేత ఇలా చేయడం 1995 తర్వాత ఇదే తొలిసారి.

i-will-work-hard-kim-jong-uns-new-years-letter-to-north-koreans
న్యూ ఇయర్‌లో కిమ్‌ చర్య: 1995 తర్వాత ఇదే!
author img

By

Published : Jan 1, 2021, 3:45 PM IST

నూతన సంవత్సరం సందర్భంగా ఉత్తర కొరియాలో ఓ అరుదైన సంఘటన చోటుచేసుకుంది. ఆ దేశ నియంత కిమ్‌ జోంగ్‌ ఉన్‌.. కరోనా కష్ట కాలంలో తనను నమ్మి, సహకరిస్తున్నందుకు దేశ ప్రజలకు గతంలో ఎన్నడూ లేని విధంగా కృతజ్ఞతలు తెలియజేశారు.

"మన దేశ ప్రజల ఆశయాలు, కోరికలు నిజరూపం దాల్చేందుకు, కొత్త శకాన్ని ఆరంభించేందుకు నేను ఈ నూతన సంవత్సరంలోనూ మరింత కృషి చేస్తాను. క్లిష్ట సమయాల్లోనూ నాపై తిరుగులేని నమ్మకం ఉంచి, మా పార్టీ వెంట నిలిచిన ప్రజలకు నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను" అంటూ కిమ్‌ కొత్త సంవత్సర ప్రారంభాన్ని పురస్కరించుకుని విడుదల చేసిన లేఖల్లో పేర్కొన్నారు.

రెండున్నర కోట్ల లేఖలు

ఈ సందేశంతో కూడిన రెండున్నర కోట్ల లేఖలను ప్రజలకు అందించామని అక్కడి అధికారులు తెలిపారు. సాధారణంగా నూతన సంవత్సరం తొలి రోజు ఈ కొరియా నేత టీవీలో ప్రసంగిస్తారు. ఐతే ఈసారి ఆ సంప్రదాయానికి విరుద్ధంగా తన సందేశాన్ని బహిరంగ లేఖల రూపంలో విడుదల చేయటం గమనార్హం. ఓ ఉత్తర కొరియా నేత ఈ విధంగా సందేశాలను విడుదల చేయటం 1995 తర్వాత ఇదే తొలిసారి.

తమ దేశంలో కరోనా కేసులే లేవని ఉత్తర కొరియా చెబుతున్నప్పటికీ.. అది అసాధ్యమని దక్షణ కొరియా, అమెరికా అంటున్నాయి. అయితే దేశ సరిహద్దుల మూసివేత తదితర కఠిన చర్యల ఫలితంగా ఆ దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. కొత్త సంవత్సరం సందర్భంగా కిమ్‌.. కుంసుసాన్‌ ప్యాలెస్‌లో ఉండే ఉత్తర కొరియా గత పాలకులైన తన తాత, తండ్రుల స్మారక చిహ్నాలను సందర్శించినట్లు అధికారులు తెలిపారు.

ఇదీ చదవండి: కరోనా అంటే కిమ్‌కు ఎందుకంత భయం?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.