ETV Bharat / international

'వృద్ధులపై కరోనా వ్యాక్సిన్ సత్ఫలితాన్నిచ్చేనా.?'

ప్రపంచ మానవాళిని కరోనా మహమ్మారి ఇంకా వణికిస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో వైరస్‌ను అంతం చేసేందుకు వ్యాక్సిన్ ఒక్కటే మార్గమని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఒకవేళ వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చినా అన్ని వయస్సుల వారిలో ఒకే విధమైన పనితీరు ఉండదని నిపుణులు విశ్లేషించారు. యువత, మధ్య వయస్సు వారితో పోలిస్తే.. వృద్ధుల్లో టీకా పనితీరు మెరుగ్గా ఉండకపోవచ్చని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

How to perform the Corona vaccine in Old age people or with Low Immunity
'వృద్ధులపై కరోనా వ్యాక్సిన్ సత్ఫలితాన్నిచ్చేనా.?'
author img

By

Published : Oct 14, 2020, 4:05 PM IST

ప్రపంచ వ్యాప్తంగా కరోనా బారినపడుతున్న వారిలో వృద్ధులే అధికం. మృతుల్లోనూ వీరి సంఖ్య ఎక్కువగా ఉంటోంది. ఇలాంటి పరిస్థితుల్లో కరోనా కోరల నుంచి వృద్ధులను కాపాడటానికి వ్యాక్సిన్‌ ఎంతో అవసరం. కానీ, వ్యక్తి వయస్సు ఆధారంగానే టీకా నుంచి కచ్చితమైన ఫలితాలు రాబట్టగలమని నిపుణులు విశ్లేషించారు. ఇతర వయస్సుల వారితో పోలిస్తే వృద్ధులపై వ్యాక్సిన్​ పనితీరు మెరుగ్గా ఉండకపోవచ్చని అభిప్రాయపడుతున్నారు.

వ్యాక్సిన్‌ ప్రధానంగా రోగనిరోధక శక్తిపై ఆధారపడి పనిచేస్తుంది. కాబట్టి బలహీనమైన రోగనిరోధక శక్తి గల వృద్ధుల్లో టీకా పనితీరు ఆశాజనకంగా ఉండకపోవచ్చని అంచనా వేశారు నిపుణులు. మరోవైపు ఇప్పటివరకు వచ్చిన వ్యాక్సిన్‌లన్నీ పిల్లల్లో వచ్చే అనారోగ్య సమస్యలకు ఉద్దేశించి వచ్చినవేనని వారు గుర్తుచేశారు. కాబట్టి వృద్ధుల్లో టీకా పనితీరు ఎలా ఉంటుంది? అనేదానికి వైద్యుల వద్ద కచ్చితమైన సమాచారంలేదని పరిశోధకులు అన్నారు.

టీకా పనితీరు అక్కడే నిర్ధరణ కావాలి..

అంటువ్యాధుల ప్రభావం ఇతర వయస్సులవారితో పోలిస్తే వృద్ధుల్లోనే అధికంగా ఉంటుంది. కొన్ని వ్యాధులు పిల్లల్లో కంటే పెద్దవారిలోనే తీవ్రంగా ప్రభావం చూపిస్తాయని నిపుణులు పేర్కొన్నారు.

సాధారణంగా హానికారక వైరస్‌లు, బ్యాక్టీరియాలు శరీరంలోకి ప్రవేశించినప్పుడు.. రోగనిరోధక శక్తి ప్రభావితమై వాటిని నశించేలా పోరాడతాయి. ఇదే సూత్రంపై వ్యాక్సిన్‌లు పనిచేస్తాయి. అయితే.. వృద్ధుల్లో వయస్సురీత్యా శరీర అవయవాలు ఏ విధంగా బలహీన పడతాయో.. రోగనిరోధక శక్తి కూడా అలాగే క్షీణిస్తున్నట్లు పేర్కొన్నారు. కాబట్టి వారిపై టీకా పనితీరు మెరుగ్గా ఉండకపోవచ్చని అంచనా వేశారు. అందువల్ల క్లినికల్‌ ట్రయల్స్ దశలోనే వృద్ధుల్లో టీకా పనితీరును నిర్ధరించుకోవాల్సి ఉంటుందని సూచించారు. అన్ని వయస్సుల వారిలో టీకా ప్రభావాన్ని అంచనా వేయాల్సిన అవసరముందని నిపుణులు స్పష్టం చేశారు.

ఇదీ చదవండి: వ్యాక్సిన్ ట్రయల్స్​ నిలిపివేసిన 'జాన్సన్ అండ్​ జాన్సన్​'​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.