ETV Bharat / international

మళ్లీ హింసాత్మకంగా మారిన హాంకాంగ్ నిరసనలు

హాం​కాంగ్​లో గత 3 నెలలుగా జరుగుతోన్న నిరసనలు హింసాత్మకంగా మారాయి. ఆదివారం ఉదయం నగరంలోని విమానాశ్రయాలకు వెళ్లే మార్గాలను నిర్బంధించారు నిరసనకారులు. దగ్గర్లోని బస్​స్టేషన్​ వద్ద బారీకేడ్లను ఏర్పాటు చేశారు. అల్లర్లు సృష్టిస్తున్న నిరసకారులను పోలీసులు చుట్టుముట్టారు.

హాంకాంగ్ విమానాశ్రయం ముట్టడి.. మిన్నంటిన ఆందోళనలు
author img

By

Published : Sep 1, 2019, 4:18 PM IST

Updated : Sep 29, 2019, 1:58 AM IST

హాంకాంగ్ విమానాశ్రయం ముట్టడి.. మిన్నంటిన ఆందోళనలు

హాంకాంగ్​లో 13వారాలుగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాగుతున్న నిరసనలు రోజురోజుకూ యుద్ధ వాతావరణాన్ని తలపిస్తున్నాయి. తాజాగా ఆదివారం ఉదయం విమానాశ్రయాలకు వెళ్లే మార్గాలను నిరసనకారులు నిర్బంధించారు. దీంతో విమానాశ్రయానికి వెళ్లే ఎక్స్​ప్రెస్​ రైళ్లను నిలిపేశారు.

విమానాశ్రయం దగ్గర్లోని బస్​ స్టేషన్​ వద్ద బారికేడ్లను ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు విమానాల రాకపోకలకు ఎలాంటి అంతరాయం కలగలేదు. అల్లర్లు సృష్టిస్తున్న నిరసనకారులను పోలీసులు చుట్టుముట్టారు.

విమానాశ్రయం సమీపంలో ప్రదర్శనలను నిషేధించినప్పటికీ.. నిరసనకారులు యథాతథంగానే అదంతా పట్టించుకోలేదు. ఇంతకుముందెన్నడూ లేని హింసాత్మక ఘటనలతో ఆగస్టు నెల ముగిసింది.

పార్లమెంటు ముట్టడి

అర్ధరాత్రి సమయంలో జరిగిన ప్రదర్శనల్లో మునుపెన్నడూ లేనంత హింసాత్మక చర్యలు జరిగాయి. నగరంలోని పార్లమెంటు భవనాన్ని ముట్టడించిన నిరసనకారులపైకి పాలీసులు బాష్పవాయువు, రబ్బర్​ బుల్లెట్లను, జల ఫిరంగులను ప్రయోగించారు.

ఆగ్రహించిన ఆందోళనకారులు వారిపై పెట్రోల్​ బాంబులను విసిరారు. పోలీసులు దొరికిన వారిని దొరికినట్లే అరెస్ట్​ చేశారు.

నాయకుల అరెస్ట్

భద్రతా కారణాల దృష్ట్యా శుక్రవారం హాంకాంగ్​ పోలీసులు నిరసనలకు మద్దతిస్తున్న నాయకులను అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికి 13 వారాల వ్యవధిలో జూన్​ నుంచి దాదాపు 900 మంది నిరసనకారులను పోలీసులు అరెస్ట్​ చేశారు.

చైనా వెనక్కి తగ్గనుందా?

హాంకాంగ్​లో నెలకొన్న పరిస్థితులు తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయని ఐరోపా సమాఖ్య రాయబారి వ్యాఖ్యానించారు. చైనాపై ప్రస్తుతం ఉన్న ఆర్థిక ఒత్తిడే హాంకాంగ్​పై సరైన నిర్ణయం తీసుకునేలా చేస్తుందని అమెరికా ప్రెసిడెంట్​ డొనాల్డ్​ ట్రంప్​ అన్నారు.

నిరసనకారుల డిమాండ్లు ఇవే

ప్రజాస్వామ్య వ్యవస్థలో సంస్కరణలు, చైనా బిల్లు రద్దు, సార్వత్రిక ఎన్నికలు, ప్రస్తుత రాజ్యాంగ రద్దు, పోలీసుల అరాచకాలపై విచారణ చేపట్టాలని ఆందోళనలు చేస్తున్నారు హాంకాంగ్ ప్రజలు.

ఇదీ చూడండి:భారత్​తో ద్వైపాక్షిక చర్చలకు సిద్ధం: ఖురేషీ

AP Video Delivery Log - 0900 GMT Horizons
Sunday, 1 September, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last 24 hours. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0830: HZ Australia Natural Burials No access Australia 4227300
The growing trend for natural burials
AP-APTN-0830: HZ Kazakhstan Uranium AP Clients Only 4227278
How uranium for power stations is produced
AP-APTN-0830: HZ North Korea Department Store AP Clients Only 4227477
A new North Korean shopping experience
AP-APTN-0830: HZ Greenland Climate Change AP Clients Only 4227036
How climate change is affecting the lives of Greenlanders
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Sep 29, 2019, 1:58 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.