ETV Bharat / international

పోలీసుపై కత్తితో దాడి.. ఆందోళనకారుడి అరెస్ట్​! - stabbing police news

హాంకాంగ్​లో జాతీయ భద్రతా చట్టానికి వ్యతిరేకంగా బుధవారం చెలరేగిన ఆందోళనల్లో పోలీసు అధికారిపై కత్తితో దాడి చేసిన వ్యక్తిని అరెస్ట్​ చేశారు పోలీసులు. గురువారం ఉదయం లండన్​ బయలుదేరుతున్న విమానంలో అతడిని అదుపులోకి తీసుకున్నారు.

Hong Kong
పోలీసుపై కత్తితో దాడి.. ఆందోళనకారుడి అరెస్ట్​!
author img

By

Published : Jul 2, 2020, 8:29 PM IST

Updated : Jul 2, 2020, 9:41 PM IST

నూతన చట్టానికి వ్యతిరేకంగా హాంకాంగ్​లో బుధవారం పెద్ద ఎత్తున నిరసనలు చెలరేగాయి. ఇందులో భాగంగా.. ఓ పోలీసు అధికారిపై కత్తితో దాడిచేసినట్లు అనుమానిస్తున్న వ్యక్తిని అరెస్ట్​ చేశారు అధికారులు. గురువారం ఉదయం లండన్​ బయలుదేరుతున్న విమానంలో అతడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.

లండన్​ వెళ్లే కాథే పెసిఫిక్​ విమానంలో "వాంగ్​" అనే ఇంటిపేరుతో ఉన్న 24ఏళ్ల యువకుడిని అరెస్ట్​ చేసినట్లు ఓ అధికారి వెల్లడించారు. వాంగ్​.. లండన్​ వెళ్లేందుకు బుధవారం టికెట్​ కొనుగోలు చేశాడని.. గురువారం ఎలాంటి తనిఖీ లేకుండానే విమానం ఎక్కాడని తెలిపారు. విమానం సిబ్బంది అతడిని పేరు పెట్టి పిలిచినా పలకకపోవటం, అతని సీట్లో కూర్చోకపోవడం వల్ల అనుమానం వచ్చి పోలీసులకు సమాచారమిచ్చారని, అనంతరం అతడిని అరెస్ట్​ చేసినట్లు చెప్పారు.

అయితే.. అతని బంధువు ఒకరు పోలీసులకు సమాచారం ఇచ్చిన క్రమంలో అరెస్ట్​ చేసినట్లు స్థానిక మీడియాలో వార్తలు రావడం గమనార్హం.

హాంకాంగ్​ నిరసనలు హింసాత్మకం

370 మంది అరెస్ట్​..

హాంకాంగ్​లో జాతీయ భద్రతా చట్టం గత మంగళవారం అమలులోకి వచ్చింది. ఇందులో భాగంగా.. చైనా, హాంకాంగ్‌ ప్రభుత్వాలను వ్యతిరేకించడాన్ని నేరంగా పరిగణిస్తారు. ఈ క్రమంలో కొత్త చట్టంపై ఆందోళనలు చెలరేగాయి. మూడురోజుల్లో సుమారు 370 మందిని అరెస్ట్​ చేశారు పోలీసులు.

Last Updated : Jul 2, 2020, 9:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.