ETV Bharat / international

తలొగ్గిన హాంగ్​కాంగ్​ సర్కార్- 'చైనా బిల్లు' రద్దు! - హాంగ్​కాం

మూడు నెలలుగా తీవ్ర ఆందోళనలకు కారణమైన.. "చైనాకు నేరస్థుల అప్పగింత బిల్లు"ను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది హాంగ్​కాంగ్​ ప్రభుత్వం. ఈ మేరకు వీడియో సందేశం ద్వారా నిర్ణయాన్ని వెల్లడించారు ముఖ్య కార్యనిర్వాహణ అధికారి కారీ లామ్​.

తలొగ్గిన హాంగ్​కాంగ్​ ప్రభుత్వం- 'చైనా బిల్లు' రద్దు!
author img

By

Published : Sep 4, 2019, 5:44 PM IST

Updated : Sep 29, 2019, 10:41 AM IST

చైనాకు నేరస్థుల అప్పగింత బిల్లుపై ప్రజల నిరసనలకు తలొగ్గింది హాంగ్​కాంగ్ ప్రభుత్వం. ఎట్టకేలకు చైనా బిల్లును ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది. ఆందోళనకారుల 5 ప్రధాన డిమాండ్లలో ఒకటైనా బిల్లు రద్దుపై వీడియో సందేశం ద్వారా నిర్ణయం వెలువరించారు హాంగ్​కాంగ్​ ముఖ్య కార్యనిర్వాహణ అధికారి కారీ లామ్​.

" ప్రజల నిరసనలకు తెరదించేందుకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో బిల్లును ఉపసహరించుకుంటోంది."

-కారీ లామ్​.

భారీ స్థాయిలో నిరసనలు

హాంగ్​కాంగ్​పై చైనా పెత్తనాన్ని నిరసిస్తూ గత జూన్​ నెల నుంచి పెద్ద ఎత్తున నిరసనలు చేపడుతున్నారు ప్రజలు. వేల మంది వీధుల్లోకి చేరి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్న క్రమంలో వందల మంది గాయపడ్డారు. పదుల సంఖ్యలో అరెస్టయ్యారు.

మార్కెట్ల సానుకూలత..

తాజాగా కారీ లామ్​ ప్రకటన ప్రస్తుతం దేశంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను సద్దుమణిగేలా చేస్తుందన్న వార్తలతో ఆ దేశ స్టాక్​ మార్కెట్లు సుమారు 4 శాతం ఎగబాకాయి.

ఆందోళనకారుల్లో వ్యతిరేకత..

ప్రభుత్వ నిర్ణయాన్ని ఆందోళనకారులు వ్యతిరేకించారు. చాలా ఆలస్యంగా చిన్న నిర్ణయం తీసుకున్నారని ఎద్దేవా చేశారు. దీనిద్వారా నిరసనలు ఆగవని స్పష్టం చేశారు. హాంగ్​కాంగ్​కు చైనా నుంచి విముక్తి కల్పించేందుకు ఇదే సరైన సమయమని పేర్కొన్నారు. సార్వత్రిక ఓటు హక్కు, అదుపులోకి తీసుకున్న నిరసనకారుల విడుదల, దాడులకు పాల్పడిన పోలీసులపై విచారణ వంటి డిమాండ్ల కోసం నిరసనలు కొనసాగిస్తామని తెలిపారు.

ఇదీ చూడండి: అత్యంత నివాసయోగ్య నగరాల్లో భారత్​లో పరిస్థితి ఇదీ..

Mysuru (Karnataka), Sep 04 (ANI): JDS-Congress workers staged protest in Karnataka's Mysore on September 04. They protested over arrest of DK Shivakumar. They sat on the road and blocked Madikeri-Mysore road. Congress leader DK Shivakumar was arrested by Enforcement Directorate under Prevention of Money Laundering Act (PMLA). DK Shivakumar alleged that IT and ED cases against him are politically motivated.
Last Updated : Sep 29, 2019, 10:41 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.