పాకిస్థాన్, సింధ్ రాష్ట్రంలో దారుణ ఘటన జరిగింది. హిందూ వర్గానికి చెందిన మైనర్ బాలుడిని (Hindu boy murdered) ఎత్తుకెళ్లి అత్యాచారానికి ఒడిగట్టారు కొందరు దుండగులు. ఆపై కిరాతకంగా హతమార్చారు.
ఏమైందంటే..?
బాబర్లోయి టౌన్‌లోని ఖైర్‌పుర్ మిర్ ప్రాంతానికి చెందిన మైనర్‌ను(Hindu boy murdered).. శుక్రవారం సాయంత్రం కొందరు దుండగులు ఎత్తుకెళ్లారు. గురునానక్ జన్మదిన వేడుకల్లో బిజీగా ఉన్న బాలుడి కుటుంబం.. ఈ సంగతి గమనించలేదు. అతడిని లైంగికంగా వేధించి.. చంపారు. స్థానికంగా ఉన్న ఓ ఇంట్లో శనివారం బాలుడి మృతదేహం లభ్యమైంది.
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న బాబర్లోయి స్టేషన్ పోలీసులు.. ఇద్దరిని అరెస్ట్ చేశారు. బాలుడి శరీరంపై గాయాలు ఉన్నట్లు శిశు సంక్షేమ సంఘం సభ్యుడు జుబిర్ మహార్ తెలిపారు. సింధ్ రాష్ట్రంలో వారంలో ఇది రెండో ఘటన అన్నారు.
పాకిస్థాన్‌లోని హిందువులపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నట్లు అనేక కథనాలు వచ్చాయి. పాక్‌లో చిన్నారులపై లైంగిక దాడులూ పెరుగుతున్నాయి.
ఇదీ చూడండి: అత్యాచారం చట్టంపై పాకిస్థాన్ యూ-టర్న్