ETV Bharat / international

ఆ మార్కెట్​లో అమ్మిన జంతువు నుంచే కరోనా వ్యాప్తి! - Lancet study

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్​.. గుర్తు తెలియని జంతువు నుంచి మానవులకు సోకినట్లు ఓ నివేదిక తేల్చింది. సార్స్​ వైరస్​ మాదిరిగానే ప్రస్తుత కరోనాకు గబ్బిలాలే మూలాలుగా పేర్కొంది. ఈ రెండు వైరస్​లు ఒకే విధంగా ఉన్నాయని.. భవిష్యత్తులో వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉన్నందున తక్షణ పరిశోధనలు అవసరమని పేర్కొంది.

Chinese coronavirus
ఆ మార్కెట్​లో అమ్మిన జంతువు నుంచే కరోనా వ్యాప్తి!
author img

By

Published : Jan 30, 2020, 3:32 PM IST

Updated : Feb 28, 2020, 1:15 PM IST

చైనా వుహాన్​లో పుట్టి ప్రపంచాన్ని కలవరపెడుతోన్న కరోనా వైరస్​పై సరికొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ భయానక వైరస్​కు ప్రధాన కారణం గబ్బిలాలుగా ద లాన్​సెట్​ జర్నల్న్​ నివేదిక పేర్కొంది. అయితే... వైరస్​ వ్యాప్తికి కారణం మాత్రం ఓ గుర్తు తెలియని జంతువని తెలిపింది.

"ఈ వైరస్​కు గబ్బిలాలు మూల కారణమై ఉంటాయి. అయితే.. వుహాన్​లోని హువానన్​ సీఫుడ్​ మార్కెట్లో విక్రయించే జంతువు ద్వారా మానవులలోకి వైరస్​ సోకినట్లు తెలుస్తోంది. భవిష్యత్తులో వేగంగా వ్యాప్తిచెందే అవకాశం ఉన్నందుకు తక్షణ పరిశోధనలు చేయాల్సిన అవసరం ఉంది."
- పరిశోధకులు.

వుహాన్​లోని తొమ్మిది మంది రోగుల నుంచి సేకరించిన కరోనా వైరస్​ 10 జన్యు శ్రేణులను విశ్లేషించగా.. ఈ వైరస్​ గబ్బిలాల ద్వారా ఉత్పన్నమైన రెండు సార్స్​ వంటి వైరస్​లకు దగ్గరి సంబంధం కలిగి ఉన్నట్లు తేలింది.

సీఫుడ్​ మార్కెట్​ ద్వారానే..

వైరల్​ నిమోనియాతో బాధపడుతున్న రోగుల ఊపిరితిత్తుల నుంచి కణాలు, స్రావాలను సేకరించి.. కరోనా వైరస్​ మానవుల్లోకి ఎలా సోకిందనే అంశంపై పరిశోధన చేపట్టారు. అయితే.. పరిశీలన చేసిన పది మంది రోగుల్లో ఎనిమిది మంది హువానన్​ సీఫుడ్​ మార్కెట్​కు వెళ్లారని తేలింది. ఒకరు అసలు అక్కడికి వెళ్లకపోయినప్పటికీ.. మార్కెట్​కు సమీపంలోని ఓ హోటల్​లో బస చేయటం ద్వారా వ్యాధిబారిన పడినట్లు గుర్తించారు.

సార్స్​ వంటిదే..

గతంలో గబ్బిలాల ద్వారా వ్యాప్తిచెంది వందల సంఖ్యలో ప్రజల ప్రాణాలను హరించిన సార్స్​ వైరస్​ను ఈ కరోనా-2019 పోలి ఉన్నట్లు పేర్కొన్నారు పరిశోధకులు. సుమారు 88 శాతం మేర ఒకే విధంగా ఉన్నట్లు తెలిపారు. లక్షణాలన్నీ మిడిల్​ ఈస్ట్​ రెస్పిరేటోరి సిండ్రోమ్​ (ఎంఈఆర్​ఏస్​)ను 50 శాతం పోలి ఉన్నట్లు చెప్పారు. చిన్న చిన్న తేడాలు మినహా సార్స్​, కరోనా ఒకే విధంగా ఉన్నట్లు తేల్చారు.

2019-కరోనా వైరస్​, బ్యాట్​-ఎస్​ఎల్​-కరోనాజట్​సీ45, బ్యాట్​-ఎస్​ల్​-కరోనా జడ్​ఎక్స్​సీ21ల మధ్య జన్యు పరమైన పోలికలు 90 శాతం కన్నా తక్కువగా ఉన్నాయి. గతంలోని గబ్బిలాల నుంచి వ్యాప్తి చెందిన ఈ రెండు వైరస్​లు ప్రస్తుతం వచ్చిన కరోనాకు మూలాలు కావని తేలింది.

ఇదీ చూడండి: భారత్​కు 'కరోనా'- కేరళలో తొలి పాజిటివ్ కేసు

Last Updated : Feb 28, 2020, 1:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.