ఇండోనేసియాలోని తూర్పు నూసా తెన్గర రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల ధాటికి కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో 41 మంది మరణించారు. తొమ్మిది మంది గాయపడ్డారు.
ఇప్పటివరకు 35 మృతదేహాలను విపత్తు నిర్వహణ బృందం గుర్తించినట్లు అధికారులు పేర్కొన్నారు. లామినేలే గ్రామంలో దాదాపు 50 ఇళ్లు బురదలో కూరుకుపోయినట్లు వివరించారు. వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు తెలిపారు.
వరదల ధాటికి వేబురాక్ గ్రామంలో నలుగురు గాయపడగా, మరో ఇద్దరు గల్లంతైనట్లు అధికారులు వివరించారు. బిమా నగరంలోనూ 10వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామన్నారు.
ఇదీ చదవండి : ట్రక్కు- బస్సు ఢీ.. 11 మంది దుర్మరణం