భారత సంతతికి చెందిన ఆస్ట్రేలియన్ హమెంట్ ధన్జీ ఎస్సీ (Hament Dhanji SC) అరుదైన ఘనత సాధించారు. ఆస్ట్రేలియా సుప్రీంకోర్టు (Australia Supreme Court) జడ్జిగా నియమితులయ్యారు. భారత సంతతికి చెందిన వ్యక్తి ఈ పదవి చేపట్టడం ఇదే తొలిసారి కావడం విశేషం.
![AUSTRALIA supreme court judge](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13011375_e-utpeguyameq7o.jpg)
సిడ్నీకి చెందిన ధన్జీ 1990లో లీగల్ ప్రాక్టీషనర్‌గా తన న్యాయవాద కెరీర్ ఆరంభించారు. మూడు దశాబ్దాల పాటు వివిధ కేసులను వాదించి.. గొప్ప న్యాయవాదిగా పేరు తెచ్చుకున్నారు. క్రిమినల్ లా విషయంలో ఆయనకు విశేష పరిజ్ఞానం ఉంది. ధన్జీ సుప్రీంకోర్టు జడ్జిగా నియమితులైన (Hament Dhanji appointment) విషయాన్ని భారత్‌లోని ఆస్ట్రేలియా హైకమిషన్ వెల్లడించింది. ఆయనను అభినందిస్తూ ట్వీట్ చేసింది.
మరోవైపు, ధన్జీ నియామకంపై ఆస్ట్రేలియా మంత్రి, సుప్రీంకోర్టు అటార్నీ జనరల్ మార్క్ స్పీక్మన్ హర్షం వ్యక్తం చేశారు. క్రిమినల్ చట్టాలలో ధన్జీకి ఉన్న అపార జ్ఞానం ధర్మాసనాన్నికి విలువైన ఆస్తి అవుతుందని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: అఫ్గాన్ విషయంలో భారత్, రష్యా కీలక నిర్ణయం