ETV Bharat / international

ఈద్​ ప్రార్థనల సారథిగా సయీద్​ వద్దు: పాక్​ - జేయూడీ అధినేత

పవిత్ర ఈద్ ప్రార్థనలకు సారథ్యం వహించేందుకు ఉగ్రవాద సంస్థ జేయూడీ అధినేత హఫీజ్​ సయీద్​కు పాకిస్థాన్ ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. ముంబయి ఉగ్రదాడుల సూత్రధారి హఫీజ్​కు గత కొన్నేళ్లలో ఎప్పడూ అనుమతి నిరాకరించలేదు.

సారథిగా సయీద్​ వద్దు
author img

By

Published : Jun 6, 2019, 6:21 AM IST

Updated : Jun 6, 2019, 7:19 AM IST

ముంబయి దాడుల సూత్రధారి, ఉగ్రవాద సంస్థ జమాత్​-ఉద్-దావా (జేయూడీ) అధినేత హఫీజ్ సయీద్​కు పవిత్ర 'ఈద్​ ఉల్ ఫితర్' సందర్భంగా పాకిస్థాన్​ ప్రభుత్వం షాకిచ్చింది. పాకిస్థాన్​ పంజాబ్​లోని ఖడాఫీ మైదానంలో జరిగిన పవిత్ర ఈద్ ప్రార్థనలకు సారథిగా ఉండేందుకు ఆయనకు అనుమతి నిరాకరించింది.

ఇందుకు బదులుగా స్థానిక మసీదుల్లో నిర్వహించే ప్రార్థనలకు సారథిగా వ్యవహరించేందుకు సయీద్​కు అనుమతినిచ్చినట్లు పాక్ అధికార ప్రతినిధి తెలిపారు.

"జేయూడీ ఉగ్రసంస్థ అధినేత మొదట ఖడాఫీ మైదానంలో ఈద్ ప్రార్థనలు చేయించాలని భావించాడు. అయితే ఈద్​కు ఒక రోజు ముందు అతను ప్రార్థనలకు సారథిగా వ్యవహరించకూడదని ప్రభుత్వం నిర్ణయం ప్రకటించింది. ఒక వేళ సయీద్ ముందుగా అనుకున్నట్లుగానే ప్రార్థనలకు సారథిగా ఉంటే.. ప్రభుత్వం అతణ్ని అరెస్టు చేసి ఉండేది." - పాక్ అధికారి

ప్రభుత్వ ఆదేశాలను పాటించడం తప్ప సయీద్​కు వేరే ప్రత్యామ్నాయం లేదు. ఖడాఫీ మైదానంలో ప్రార్థనలు ఆపేందుకు కూడా అవకాశం లేదని అధికారి తెలిపారు.

కొన్నేళ్లుగా ఖడాఫీ మైదానంలో జరిగే ఈద్ ఉల్ ఫితర్, ఈద్​ ఉల్ అజా ప్రార్థనలకు సారథిగా సయీద్​ వ్యవహరిస్తున్నాడు. ఈ ప్రార్థనలకు ప్రభుత్వం కూడా గట్టి భద్రతను కల్పించేది. అయితే గతంలో ప్రార్థనలకు సారథ్యం వహించడమే కాకుండా.. అక్కడికి వచ్చిన వేలాదిమంది ప్రజల ముందు కశ్మీర్​పై తన కార్యచరణను చెప్పేవాడు సయీద్.

సయీద్​ను నిషేదించిన ఐరాస

ముంబయి ఉగ్రదాడులకు సుత్రధారిగా వ్యవహరించి.. 166 మంది మరణానికి కారణమైన సయీద్​పై ఐక్యరాజ్య సమితి 2008 డిసెంబర్​ 10న నిషేధం విధించింది.

ఇదీ చూడండి: 'ప్రపంచవ్యాప్తంగా ప్రమాదంలో పత్రికా స్వేచ్ఛ'

Lucknow (Uttar Pradesh), May 06 (ANI): Polling for 5th phase of Lok Sabha is underway in seven states across the country. Poling will held for 51 parliamentary constituencies today. Singer Malini Awasthi cast her vote in Uttar Pradesh's Lucknow today. While speaking to ANI, she said, "During the time of elections, there are many issues. For me on personal note there are two issues, first is country, secondly the way I had imagined the country, it is going on that track. There should be strong public expectation in the country. My vote is for that government, which thinks and works for women empowerment and think for the poor people".
Last Updated : Jun 6, 2019, 7:19 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.