ETV Bharat / international

ఇండో-శ్రీలంక బంధం: పాత చెలిమికి కొత్త పాదు..!

ద్వీప దేశం శ్రీలంక, భారత్ మధ్య అవినాభావ సంబంధం ఉంది. ఇరు దేశాల మధ్య నెయ్యం 'సేతు'వుల కాలం నాటిది. రాజపక్స శ్రీలంక పీఠాన్ని అధిరోహించిన నేపథ్యంలో భారత్, శ్రీలంక మధ్య గత సంబంధాలు భవిష్యత్తులో ఎటువంటి ప్రభావం చూపుతాయో చూడాలి.

gotabaya
శ్రీలంకతో ఇండియా నయా నెయ్యం పాదు కుదిరేనా?
author img

By

Published : Dec 2, 2019, 7:33 AM IST

Updated : Dec 2, 2019, 7:53 AM IST

పొరుగున శ్రీలంకతో ఇండియా నెయ్యం 'సేతు'వుల కాలం నాటిది. దాదాపు 12 శాతంగా ఉన్న తమిళుల జన సంఖ్య రీత్యా బొడ్డు పేగు బంధంతోపాటు, ఆ దేశ సమైక్యత సమగ్రతలకోసం నెత్తురు చిందించిన ఐపీకేఎఫ్‌ (ఇండియన్‌ పీస్‌ కీపింగ్‌ ఫోర్స్‌) త్యాగాల రీత్యా శ్రీలంకతో రక్త సంబంధమూ బలంగా పెనవడి ఉంది. ద్వీప దేశానికి పెద్ద దిక్కుగా ఇండియా దశాబ్దాల తరబడి చేదోడు వాదోడుగా ఉన్నప్పటికీ 2005లో శ్రీలంక అధ్యక్షుడిగా మహింద రాజపక్స ఎన్నికైనప్పటినుంచే కొలంబోకు బీజింగుతో సాన్నిహిత్యం బలపడుతూ వచ్చింది.

దిల్లీ-కొలంబోల మధ్య సంబంధాలు?

తమిళ పులుల ఉగ్రవాదాన్ని తెగటార్చి తనకిక ఎదురే లేదనుకొన్న మహింద రాజపక్స- 2015లో తన ఘోర పరాజయానికి ఇండియానే కారణమని ఘాటు విమర్శలు రువ్వారు. ఇటీవలి శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో మహింద సోదరుడు గోటబాయ రాజపక్స ఘన విజయం సాధించడం, దేశ ప్రధానిగా మహిందను నియమించడంతో దిల్లీ- కొలంబోల మధ్య సంబంధాలు ఏ తీరుగా ఉండబోతున్నాయన్న సందేహాలు జోరెత్తాయి. క్షేత్రస్థాయి వాస్తవాల్ని గుర్తించి గోటబాయ ప్రమాణ స్వీకారం మర్నాడే భారత విదేశాంగ మంత్రి జయశంకర్‌ ద్వారా ప్రధాని మోదీ సాదర ఆహ్వానాన్ని అందించడం, దాన్ని మన్నించి శ్రీలంక అధ్యక్షుడు విచ్చేయడం- వాతావరణాన్ని ఎంతగానో తేటపరిచాయి.

ఉభయ దేశాల సంబంధాల్ని అత్యున్నత స్థాయికి చేర్చాలన్న సంకల్పం ప్రకటించిన గోటబాయ, భారతావని భద్రతను దెబ్బతీసేలా ఏ పనీ చేయాలనుకోవడం లేదని స్పష్టీకరించారు. అపోహలు, అపార్థాలు తొలగిపోయేలా నిక్కచ్చిగా వ్యవహరిస్తామన్న ప్రకటనను వెన్నంటి శ్రీలంకలో చైనా పెట్టుబడులకు ప్రత్యామ్నాయం ఏమిటో ఇండియా సహా ఇతర దేశాలే చూపాలనీ కోరుతున్నారు. లంకలో ఉగ్రవాద నిర్మూలన వ్యవస్థల బలోపేతానికి రూ.360 కోట్లు, సులభతర రుణం రూపేణా మరో రూ.2870 కోట్లు ఇస్తున్న ఇండియా పాత చెలిమికి కొత్తగా పాదు చేసే క్రమంలో జాగ్రత్తగా అడుగులు వేయక తప్పదు!

అధ్యక్ష ఎన్నికలు అద్దం పట్టేలా

పక్షం రోజుల క్రితం నాటి అధ్యక్ష ఎన్నికలు లంక సమాజంలోని భిన్న వర్గాల ప్రజల తీవ్ర భయాందోళనలకే అద్దం పట్టాయి. నిరుడీ రోజుల్లో దేశాధ్యక్షుడిగా మైత్రీపాల సిరిసేన రాజేసిన రాజకీయ సంక్షోభం శ్రీలంకను అస్థిర పరిస్థితుల్లోకి నెట్టేయడంతోపాటు భద్రతా వ్యవస్థల్నీ నిస్తేజం చేసేసింది. ‘సుప్రీం’ రాజ్యాంగ ధర్మాసనం తీర్పు దరిమిలా ప్రధాని పదవీ పగ్గాలు విక్రమసింఘే చేతికి వచ్చినా, ‘ఈస్టర్‌ డే’ నాటి భయానక బాంబు దాడులతో యావద్దేశం కన్నీటి సంద్రమైంది. ఇండియా, అమెరికాలనుంచి బాంబుదాడుల ముప్పుపై ముందస్తుగా విస్పష్ట సమాచారం ఉన్నా భద్రతా యంత్రాంగాలు వెలగబెట్టిన నిష్క్రియను పార్లమెంటరీ సెలక్ట్‌ కమిటీ సూటిగా తప్పుపట్టింది. కొత్తగా కోరసాచిన ఐఎస్‌ ఉగ్రవాదాన్నీ ఉక్కుపాదంతో అణచివేయాలంటే అధ్యక్ష పదవికి గోటబాయే సరైన వ్యక్తి అని సింహళ మెజారిటీ జనావళి విశ్వసించింది.

గోటబాయ పాలనకు ప్రధాన సవాలు!

ఉత్తర తూర్పు పరగణాల్లో మెజారిటీ వర్గంగా ఉన్న తమిళులు, ముస్లిములు మాత్రం- ఉగ్రవాద నిర్మూలన పేరిట జరిగే మారణ హోమాన్ని తలచుకొని గోటబాయ ప్రత్యర్థి సజిత్‌ ప్రేమదాస వైపే మొగ్గారు. మెజారిటీ సింహళ ఓటే తనను నెగ్గించినా దేశాధ్యక్షుడిగా అందరికీ న్యాయం చేస్తానన్న గోటబాయ- తమిళుల ఆకాంక్షల్ని, వారికి దన్నుగా నిలిచే ఇండియాను విస్మరించి ముందడుగు వేసే పరిస్థితి లేదు. ‘దేశ దక్షిణ భాగంలో ప్రజలు ‘సమాఖ్య’ అన్న మాట వింటే, ఉత్తర ప్రాంతం వారు ‘కేంద్రీకృత’ అంటే భయపడుతున్నారు...అందరి ఆమోదం పొందగలిగే వ్యవస్థ కావాలి’- అని ప్రకటించిన మైత్రీపాల అంతిమంగా వెలగబెట్టిందేమీ లేదు. రాజ్యాంగానికి 1987లో చేసిన 13వ సవరణ అనుసారం తమిళ ప్రాబల్య ప్రాంతాలకు పూర్తిస్థాయి అధికారాల బదిలీ మెజారిటీ (సింహళ) అభీష్టానికి భిన్నంగా సాధ్యం కాదని తేల్చి చెబుతున్న గోటబాయ- అభివృద్ధిపైనే దృష్టి సారిస్తానంటున్నారు. చిరకాలంగా నానుతున్న ఈ సమస్య కొత్త సంక్షోభానికి అంటుకట్టకుండా కాచుకోవడం గోటబాయ పాలనకు ప్రధాన సవాలు!

కనిష్ఠానికి వృద్ధి రేటు

పాతికేళ్లకుపైగా తమిళ పులుల ఉగ్రవాదంతో కిందుమీదులైన శ్రీలంకకు దేశీయంగా ఐఎస్‌ ఉగ్ర ప్రజ్వలనం నిజంగా ఊహించని ఉత్పాతం. ఈస్టర్‌ డే నాటి భయానక ఉగ్రవాద దాడుల దరిమిలా- అంతక్రితం దాకా స్థూల దేశీయోత్పత్తిలో అయిదు శాతం సమకూరుస్తున్న పర్యాటకం బాగా దెబ్బతిని పోవడం- శ్రీలంకను వెంటాడుతున్న కష్టం. మైత్రీపాల జమానాలో 2016లో నాలుగున్నరశాతంగా ఉన్న వృద్ధిరేటు నేడు పద్దెనిమిదేళ్ల కనిష్ఠానికి 2.5శాతానికి పడిపోయింది.

దానికి తోడు జీడీపీలో 78 శాతానికి చేరిన రుణ భారం శ్రీలంక నడ్డి విరుస్తోంది. చైనా ప్రాబల్య విస్తరణకు అత్యంత అనుకూలమైన వాతావరణమది! మహింద రాజపక్స జమానాలోనే ఉత్తరంనుంచి దక్షిణం దాకా విద్యుత్‌ కేంద్రాలు, నౌకాశ్రయాలు, విమానాశ్రయాలు, రోడ్డు రైలు మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల కాంట్రాక్టులు పొందిన బీజింగ్‌- అణు జలాంతర్గాముల్ని శ్రీలంక తీరంలో మోహరించే స్థాయిలో చొచ్చుకు వచ్చింది. ‘భారత్‌ బంధువు-చైనా భాగస్వామి’ అన్న ధోరణికి కొద్ది భిన్నంగా ‘సమదూరాన్ని’ గోటబాయ ప్రస్తావిస్తున్నా, తక్కిన దేశాలు ప్రత్యామ్నాయ పెట్టుబడి దారులు చూపకుంటే ‘బెల్ట్‌ అండ్‌ రోడ్‌’ చొరవతో చైనీయులు దూసుకొస్తారనీ చెబుతున్నారు!

వృద్ధి రేట్లు కుంగి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకోసం ఇండియాయే మోర చాస్తున్న దశలో శ్రీలంకకు ఇతోధిక సాయం కష్టమే. అలాగని చేతులు ముడుచుకొంటే దేశ దీర్ఘకాలిక ప్రయోజనాలకు నష్టమే! ఒక్క తమిళులకోసమే కాదు, మొత్తం శ్రీలంక విశాల హితం కోసం ఇండియా కృషి చేస్తోందన్న సానుకూల సందేశం అందేలా స్నేహ సేతువును పటిష్ఠీకరించుకోవడం ఉభయ తారకం!

ఇదీ చూడండి : ఎన్​సీపీకే కీలక 'మహా' మంత్రి పదవులు!

AP Video Delivery Log - 1800 GMT News
Sunday, 1 December, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1757: Italy Pope Nativity AP Clients Only 4242611
Pope Francis celebrates power of Nativity scenes
AP-APTN-1741: Stills UK Attack Victims Content has significant restrictions, see script for details 4242609
Stills released of victims of London Bridge attack
AP-APTN-1736: MidEast Netanyahu Iran AP Clients Only 4242607
Israel PM criticises European countries over Iran
AP-APTN-1701: UK Attack Service No access UK, Republic of Ireland; No use by BBC, SKY, Channel 4 Group, Channel 5 Group, RTE, TG4; No online access by any UK or Republic of Ireland newspaper platform; No online access for .co.uk sites, or any site (or section) aimed at audiences in the UK or Republic of Ireland 4242606
Service at Southwark Cathedral for attack victims
AP-APTN-1620: Russia Bus Crash Reax Part must credit Emergency Situations Ministry 4242600
Reax to deadly bus crash that killed 19 in Siberia
AP-APTN-1605: UK Attack University No access UK, Republic of Ireland; No use by BBC, SKY, Channel 4 Group, Channel 5 Group, RTE, TG4; No online access by any UK or Republic of Ireland newspaper platform; No online access for .co.uk sites, or any site (or section) aimed at audiences in the UK or Republic of Ireland 4242597
Cambridge Uni: 'devastated' over attack victims
AP-APTN-1600: UK Attack Flowers No use by BBC, ITN (Including Channel 4 And 5), Al Jazeera, Bloomberg 4242596
Tributes to attack victims left on London Bridge
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Dec 2, 2019, 7:53 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.