ETV Bharat / international

రష్యాలో కరోనా విజృంభణ- ఇరాన్​లో పెరిగిన మరణాలు - global covid-19 cases

ప్రపంచవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 3 కోట్ల 55 లక్షల 20వేలు దాటింది. మరో 10 లక్షల 43వేలమందిపైగా మృతి చెందారు. భారత్, రష్యా, మెక్సికో సహా పలు దేశాల్లో కరోనా విలయం కొనసాగుతోంది.

GLOBAL COVID-19 CASES
రష్యాలో కరోనా ఉగ్రరూపం- ఇరాన్​లో మరణమృదంగం
author img

By

Published : Oct 5, 2020, 10:22 PM IST

ప్రపంచ దేశాల్లో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. మొత్తం కేసుల సంఖ్య 3 కోట్ల 55 లక్షల 20 వేల 132కు చేరింది. 10 లక్షల 43వేల 146మంది కొవిడ్​కు బలయ్యారు. అయితే ఇప్పటివరకు 2 కోట్ల 67 లక్షల 18 వేల మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు.

  • రష్యాలో కొత్తగా 10 వేల 888 కేసుల నమోదవగా.. 117మంది చనిపోయారు. ఫలితంగా మొత్తం బాధితుల సంఖ్య 12 లక్షల 26వేలకు చేరువైంది.
  • మెక్సికోలో తాజాగా 208మంది మహమ్మరికి బలయ్యారు. ఒక్కరోజే 3, 712 మంది కొవిడ్​ బారినపడ్డారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 7 లక్షల 61 వేలు దాటింది.
  • ఇరాన్​లో మరణాల సంఖ్య పెరుగుతోంది. మరో 235మంది కొవిడ్​తో మృతిచెందగా.. కొత్తగా 3,900మందికి కరోనా పాజిటివ్​గా తేలింది.
  • ఇరాక్​లో ఒక్కరోజే 3,808 కేసులు వెలుగుచూశాయి. 65మంది మరణించారు.
  • ఇండోనేసియాలో తాజాగా 3,622 మందికి కొవిడ్ సోకగా.. 102మంది మృతి చెందారు. ఫలితంగా మొత్తం బాధితుల సంఖ్య 3 లక్షల 7 వేలు దాటింది.
  • నెదర్లాండ్స్​లో కరోనా ఉగ్రరూపం దాల్చుతుంది. కొత్తగా 4,579మంది కరోనా బారిన పడ్డారు. ఏడుగురు మరణించారు.
  • ఇటలీ, బెల్జియం, పోలాండ్​, నేపాల్​ దేశాల్లో 2వేల చొప్పున కేసులు నమోదయ్యాయి.
దేశంమొత్తం కేసులు మొత్తం మరణాలు
అమెరికా76,46,5162,14,707
భారత్66,50,4561,03,005
బ్రెజిల్​49,18,0221,46,417
రష్యా12,25,88921,475
కొలంబియా8,55,05221,475

ఇదీ చూడండి: 'ప్రతి 10 మందిలో ఒకరికి కరోనా'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.