ప్రభుత్వం నుంచి ఆదేశాలు వస్తే పాక్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే)ను స్వాధీనం చేసుకుంటామని భారత సైన్యాధిపతి ఎంఎం నరవణే చేసిన వ్యాఖ్యలపై పాక్ స్పందించింది. భారత్ ఎలాంటి చర్యలకు పాల్పడినా ఎదుర్కొనేందుకు తాము సిద్ధమని పేర్కొంది.
"భారత్లో జరుగుతున్న ఆందోళనల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే, నియంత్రణ రేఖ వద్ద సైనిక చర్యలు చేపడతామని భారత ఆర్మీ చీఫ్ వ్యాఖ్యలు చేశారు. భారత్ ఎటువంటి చర్యలు చేపట్టినా పాక్ ఎదుర్కొంటుంది."
-ఆసిఫ్ గఫూర్,పాకిస్తాన్ ఆర్మీ అధికార ప్రతినిధి.
జమ్ము కశ్మీర్లోని అన్ని ప్రాంతాలను పాక్ వదిలి వెళ్లాలని 1994 ఫిబ్రవరిలోనే భారత పార్లమెంట్ తీర్మానించింది.
ఇదీచూడండి:దీపకాంతుల్లో మెరిసిన 'హావ్డా' అందాలు