ETV Bharat / international

శాంతి చర్చలకు తూట్లు.. అఫ్గాన్​ సైన్యంపై తాలిబన్ల దాడి! - అఫ్గానిస్థాన్​ శాంతి చర్చలు

అఫ్గాన్​ ప్రభుత్వం, తాలిబన్ల మధ్య తొలిసారి ముఖాముఖీ చర్చలు జరిగిన మరుసటి రోజునే ఆ దేశంలోని పలు ప్రాంతాల్లో దాడులు జరిగాయి. శాంతి చర్చలకు తూట్లు పొడుస్తూ అఫ్గాన్​ బలగాలపై దాడులకు పాల్పడ్డారు తాలిబన్లు. దీంతో చర్చలు ఇప్పట్లో కొలిక్కి వచ్చే పరిస్థితులు కనిపించటం లేదు.

Fresh clashes between Taliban, Afghan army
అఫ్గాన్​ సైన్యంపై తాలిబన్ల దాడి!
author img

By

Published : Sep 13, 2020, 8:06 AM IST

అఫ్గానిస్థాన్​లో దశాబ్దాలుగా కొనసాగుతున్న అంతర్యుద్ధానికి తెరదించే లక్ష్యంతో ఖతార్​ దోహా వేదికగా తాలిబన్లతో శనివారం (సెప్టెంబర్​ 12న) శాంతి చర్చలు చేపట్టింది ఆ దేశ ప్రభుత్వం. తాలిబన్లతో నేరుగా చర్చలు చేపట్టటం ఇదే తొలిసారి. అయితే.. చర్చలు చేపట్టిన మరుసటిరోజే అఫ్గాన్​ సైన్యంపై పలు చోట్ల దాడులు జరిగాయి. శాంతి స్థాపన లక్ష్యాలకు తూట్లు పొడుస్తూ అఫ్గాన్​ బలగాలే లక్ష్యంగా తాలిబన్లు దాడులు చేపట్టారు. ఈ ఘటనలతో ఇప్పట్లో చర్చలు కొలిక్కి వచ్చే పరిస్థితులు కనిపించటం లేదని తెలుస్తోంది.

దేశంలోని కాంధార్​ రాష్ట్రంలో అఫ్గాన్​ బలగాలే లక్ష్యంగా దాడులు జరిగాయి. ఈ ఘటనల్లో ఆరుగురు తాలిబన్లు హతమవగా.. పలువురు తీవ్రంగా గాయపడినట్లు ఆ దేశ మీడియా వెల్లడించింది. వైమానిక దాడుల ద్వారా అఫ్గాన్​ బలగాలు ప్రతీకారం తీర్చుకున్నాయని అటల్​ దళం ప్రతినిధి ఖ్వాజా తెలిపారు.

మరో రాష్ట్రంలో..

నంగార్​హర్​ రాష్ట్రం శేర్జాద్​ జిల్లా జోజాన్​ కాలా ప్రాంతంలో అఫ్గాన్​ బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో 13 మంది తాలిబన్లు హతమైనట్లు అధికారులు తెలిపారు. అందులో తొమ్మిది మంది పాకిస్థానీలు ఉన్నారని చెప్పారు.

అయితే.. ఈ అంశంపై తాలిబన్ల నుంచి ఇంకా ఎలాంటి స్పందన రాలేదు.

ఇవీ చూడండి: 'అఫ్గాన్​ సమగ్రతను కాపాడేలా శాంతి ప్రక్రియ ఉండాలి'

అమెరికా సమక్షంలో అఫ్గాన్​, తాలిబన్ల శాంతి చర్చలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.