ETV Bharat / international

వరదలతో చైనా అతలాకుతలం.. భారీ ఆస్తినష్టం

author img

By

Published : Aug 12, 2020, 4:51 PM IST

చైనాను భారీ వర్షాలు వణికిస్తున్నాయి. వరదల కారణంగా మరో 14 మంది మృతి చెందారు. వరద ఉద్ధృతి ఎక్కువగా ఉన్న కారణంగా త్రీ గోర్జెస్​ డ్యాం గేట్లను ఎత్తి నీటిని దిగువకు పారించారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 49 బిలియన్​ యువాన్ల ఆస్తి నష్టం వాటిల్లింది.

Floods kill 14 in China as water peaks at Three Gorges Dam
వరదలతో చైనా అతలాకుతలం.. భారీ ఆస్తినష్టం

దక్షిణ చైనాలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వరదల కారణంగా మరో 14 మంది మృతి చెందారు. యాంగ్జీ నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. వరద నీరు గ్రామాల్లోకి రాకుండా సైనికులు, ఆ ప్రాంత ప్రజలు ఇసుక సంచులను అడ్డు వేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

వరదలతో చైనా అతలాకుతలం

వరద ప్రవాహం ఎక్కువగా ఉన్నందున త్రీ గోర్జెస్​ డ్యామ్​ మూడు గేట్లను ఎత్తి.. నీటిని దిగువకు పారించారు. జలాశయంలో సాధారణ స్థాయిని మించి 15 మీటర్ల ఎత్తుకు నీరు చేరిందని పేర్కొన్నారు అధికారులు.

చాంగ్‌కింగ్‌ ప్రాంతంలో వరదల ధాటికి 11 మంది మరణించారు. ఇప్పటివరకు 1,031 ఇళ్లు నేలమట్టమవ్వగా, 20 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. డున్హావో పట్టణంలో 39 సెంటీమీటర్లు వర్షపాతం నమోదైంది. కొండచరియలు విరిగిపడుతున్నాయి.

18 లక్షల మంది తరలింపు

ఏటా కురిసే వాన కన్నా ఈ ఏడాది అధిక వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. దేశ వ్యాప్తంగా మొత్తం 18 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వరదల కారణంగా 49 బిలియన్ యువాన్ల మేర ఆస్తి నష్టం వాటిల్లినట్లు వెల్లడించారు.

ఇదీ చూడండి:వరద కష్టాలు.. ఇళ్ల పైకప్పులే నివాసాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.