ETV Bharat / international

'భారత్​లోనే ఉంటాం..సాయం చేయండి'

author img

By

Published : Mar 21, 2021, 7:28 PM IST

మయన్మార్‌లో సైన్యం ఆదేశాలను ధిక్కరించి భారత్​కు వచ్చిన ఇద్దరు పోలీస్​ అధికారులు తమకు మానవతా దృక్పథంతో భారత్​లోనే ఆశ్రయం కల్పించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కోరారు. మయన్మార్‌లో సాధారణ పౌరులపై చేస్తున్న అరాచకాలను ఒక్కొక్కటిగా వివరించారు.

Fleeing coup, Myanmar police refugees in India seek asylum
'భారత్​లోనే ఉంటాం..సాయం చేయండి'

మయన్మార్‌లో సైనిక ప్రభుత్వం అరాచకాలు పెచ్చుమీరుతున్నాయి. ఉద్యమిస్తున్న పౌరులను హింసించాలని అక్కడి పోలీసులకు సైనిక సర్కారు ఆదేశాలు జారీ చేస్తోంది. సైన్యం ఆదేశాలను ధిక్కరించిన ఇద్దరు మయన్మార్‌ పోలీస్ అధికారులు శరణార్థులుగా భారత్‌కు వచ్చి సాయం కోరుతున్నారు. మిజోరంలో ఆశ్రయం పొందుతున్న ఆ అధికారులు మయన్మార్‌లో పౌరులపై జరుగుతున్న దాడుల గురించి చెబుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు.

అందుకే వచ్చాం..

మయన్మార్‌లో ప్రజాస్వామ్యం కోసం ఉద్యమిస్తున్న వారిని కాల్చి వేయాలన్న సైన్యం ఆదేశాలను ధిక్కరించిన ఇద్దరు పోలీసు అధికారులు సరిహద్దులు దాటి భారత్‌లోకి ప్రవేశించారు. తిరిగి వెళ్లడం ఇష్టంలేని తమకు మానవతా దృక్పథంతో భారత్‌లో ఆశ్రయం కల్పించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కోరారు. మయన్మార్‌లో సైన్యం సాధారణ పౌరులపై చేస్తున్న అరాచకాలను ఒక్కొక్కటిగా వివరించారు. ఎక్కడ ప్రజలు ఆందోళనలు చేసినా వారిని అరెస్ట్‌ చేసి చిత్రహింసలు పెట్టాలని సైనిక ప్రభుత్వం తమను ఆదేశించిందని పేర్కొన్నారు. అమాయక ప్రజలను హింసించడం ఇష్టం లేకే కుటుంబంతో సహా దేశం వదిలి వచ్చినట్లు మయన్మార్‌ పోలీసు అధికారులు వివరించారు.

ప్రస్తుతం మిజోరంలోని ఓ గ్రామంలో ఈ ఇద్దరు పోలీసు అధికారులు ఆశ్రయం పొందుతున్నారు. కుటుంబాలతో కలిసి క్షేమంగా ఉన్నారు. స్థానికులు అన్ని రకాలుగా ఆదుకుంటున్నారని చెప్పారు. దేశాన్ని వదిలి రావడం బాధగా ఉన్నా తప్పలేదని వాపోయారు.

"మయన్మార్‌ పోలీస్‌ అధికారి సైనిక పాలనలో కనీసం నిద్ర పోయే సమయం కూడా మాకు లేదు. ఎప్పుడూ ఏ ఆదేశాలు సైన్యం ఇస్తుందో అని కలవరపడే వాళ్లం. ఆందోళనలు జరిగినప్పుడల్లా మమ్మల్ని ముందు వైపునకు పంపించి సైన్యం వెనుక ఉండేది. ఆందోళనకారులను అరెస్టు చేసి హింసించాలని సైన్యం మమ్మల్ని ఆదేశించేది. పౌరులను హింసించడం ఇష్టంలేని మాకు దేశం విడిచి రావడం తప్ప మరో మార్గం కనిపించలేదు."

-- మయన్మార్​ నుంచి వచ్చిన పోలీస్​ అధికారి

సైన్యం నిరంకుశ పాలన

మయన్మార్‌లో పౌర ప్రభుత్వాన్ని పునరుద్ధరించాలని చేస్తున్న ఆందోళనలను ఆ దేశ సైన్యం తీవ్రంగా అణచి వేస్తోంది. ఇప్పటి వరకు 200 మంది పౌరులు భద్రతా బలగాల కాల్పుల్లో మృతి చెందారు. సైన్యం నిరంకుశ చర్యల వల్ల చాలామంది మయన్మార్‌ ప్రజలు సరిహద్దుల గుండా భారత్‌లోకి ప్రవేశిస్తున్నారు. ఇంతవరకు ఎంత మంది శరణార్థులు మిజోరం వచ్చారో తెలియనప్పటికీ వారి సంఖ్య వందల సంఖ్యలో ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. తొలుత మయన్మార్‌ నుంచి వచ్చిన శరణార్థులను మిజోరం ప్రభుత్వం అనుమతించింది. ఐతే మానవతా కారణాలతో తప్ప మయన్మార్‌ నుంచి ఎవర్నీ భారత్‌లోకి అనుమతించవద్దని ఆ దేశంతో సరిహద్దులు కలిగిన మిజోరం సహా నాలుగు రాష్ట్రాలకు కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది.

భారత్‌తో 16 వందల 43 కిలోమీటర్ల సరిహద్దును మయన్మార్‌ పంచుకుంటోంది. సరిహద్దు కిలోమీటర్ల మేర ఉండటంతో మయన్మార్‌ శరణార్థులను భారత్‌లోకి రాకుండా అడ్డుకోవడం కష్టంగా ఉందని అధికారులు చెబుతున్నారు. శరణార్థుల సమస్యను పరిష్కరించడానికి కేంద్రం ఓ నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు.

ఇదీ చదవండి : మయన్మార్​లో.. ప్రజాస్వామ్యమే బందీ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.