యూఏఈ రాజధాని అబుదాబిలో తొలిసారిగా రూపుదిద్దుకుంటోన్న హిందూ దేవాలయానికి సంబంధించిన చిత్రాలు విడుదలయ్యాయి. భారత సంప్రదాయ పద్ధతిలో నిర్మిస్తోన్న ఈ ఆలయంలో హిందూ పురాణాలు, గ్రంథాలు వంటి అలంకరణలు ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నాయి. మన దేశ తరహాలోనే చేతితో చెక్కిన రాతి స్తంభాలను ఉపయోగిస్తున్నారు. ఈ మేరకు సంబంధిత దృశ్యాలను విడుదల చేశారు బోచాసాన్వి శ్రీ అక్షర్ పురుషోత్తమ్ స్వామినారాయణ్ సంస్థాన్(బీఏపీఎస్) అధికార ప్రతినిధి అశోక్ కొటెచా.
ఈ ఆలయ నిర్మాణం కోసం రాజస్థాన్, గుజరాత్లలో తయారైన ప్రత్యేక శిలలను ఉపయోగిస్తున్నారు. ఆలయ వెలుపలి భాగంలో గ్రంథాలయం, తరగతి గది, సమావేశ భవనాలను నిర్మించనున్నారు.ప్రవేశ ద్వారంలో ఏర్పాటు చేసిన జలపాతం, ఆలయం చుట్టూ ప్రత్యేకంగా రూపొందించిన నీటి వనరుల దృశ్యాలు చూపరులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
-
With thanks to the #UAE - the land of #Tolerance, share your #DiwaliMemories of years past.
— BAPS Hindu Mandir, Abu Dhabi (@AbuDhabiMandir) November 8, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
Post. Tag. Visit.
Celebrate #UAEDiwali. pic.twitter.com/UaInAa8AfY
">With thanks to the #UAE - the land of #Tolerance, share your #DiwaliMemories of years past.
— BAPS Hindu Mandir, Abu Dhabi (@AbuDhabiMandir) November 8, 2020
Post. Tag. Visit.
Celebrate #UAEDiwali. pic.twitter.com/UaInAa8AfYWith thanks to the #UAE - the land of #Tolerance, share your #DiwaliMemories of years past.
— BAPS Hindu Mandir, Abu Dhabi (@AbuDhabiMandir) November 8, 2020
Post. Tag. Visit.
Celebrate #UAEDiwali. pic.twitter.com/UaInAa8AfY
భారత్, యూఏఈల మార్గనిర్దేశంతో..
చారిత్రాత్మకమైన ఈ ఆలయం.. భారత్, యూఏఈల మార్గనిర్దేశం ప్రకారం నిర్మిస్తున్నారు అధికారులు. ఈ హిందూ పుణ్యక్షేత్రం కోసం గతేడాది ఏప్రిల్లో పునాదులు పడగా.. అదే సంవత్సరం డిసెంబర్ నుంచి నిర్మాణ పనులు ప్రారంభించారు. మందిరానికి సంబంధించిన మాస్టర్ ప్లాన్ రూపకల్పన ఈ ఏడాది ఆరంభంలోనే పూర్తయింది. అయితే.. కరోనా మహమ్మారి కారణంగా నిర్మాణ పనులు మరింత ఆలస్యమవుతున్నాయి.
ఈ ఆలయంలో కథలు, శిల్పాలు భారత భౌగోళిక, హిందూ విశ్వాసాలకు తగినట్టుగా ఉంటాయన్నారు అశోక్. ఇందులో మహాభారతం, రామాయణం వంటి పురాణాలు, ప్రాంతీయ చరిత్రలనూ ఏర్పాటు చేస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు.
మందిర నిర్మాణం కోసం రాతి పనులు భారత్లో కొనసాగుతున్నాయి. రాజస్థాన్ ఇసుకరాయి, ఇటాలియన్ కెరానా మార్బుల్తో శిల్పాలను రూపొందిస్తున్నారు.
యూఏఈలో ఉన్న 30 లక్షల మంది భారతీయులు సహా.. పర్యటకుల కోసం ఈ ఆలయం ముస్తాబవుతోంది.
ఇదీ చూడండి: 'మిస్ యూఎస్'గా నిలిచిన అస్యా బ్రాంచ్