ETV Bharat / international

వరిసాగులో ఆవిష్కరణ.. రెండు మీటర్లు పెరిగే మొక్క! - చైనా వరి విత్తనాలు

సాధారణంగా వరిమొక్కలు 100-130 సెంటీమీటర్లు ఎత్తు పెరుగుతాయి. మరి అవే మొక్కలు జొన్న చెట్లలా పెరిగితే? సగటున రెండు మీటర్ల ఎత్తుతో.. పొడవైన కొమ్మలు కలిగి ఉంటే? వినడానికే ఆశ్చర్యంగా ఉందికదూ? అయితే ఈ తరహా మొక్కల్ని త్వరలోనే చూడొచ్చు అంటున్నారు చైనా శాస్త్రవేత్తలు. ఎప్పటికప్పుడు నూతన వంగడాలను అభివృద్ధి చేస్తున్న ఆ దేశం.. వరి సాగులో సరికొత్త ప్రయోగాన్ని చేపట్టింది.

2-meter high rice plants
2-meter high rice plants
author img

By

Published : Sep 26, 2021, 8:57 PM IST

వరిసాగులో తనదైన ముద్ర వేస్తున్న చైనా.. సరికొత్త వంగాడాలను ఆవిష్కరించింది. ఇప్పటికే ప్రపంచంలో అత్యధికంగా వరిని ఉత్పత్తి చేస్తుండగా.. ప్రస్తుతం రెండు మీటర్ల పొడవైన వరి మొక్కలను సాగును ప్రారంభించింది. ఈ వంగడాలతో ఎకరా స్థలంలో రెట్టింపు ధాన్యాన్ని పండించవచ్చని చెబుతోంది. ఈ మేరకు నైరుతి చైనాలోని చాంగ్‌కింగ్​లో ఓ హెక్టార్ విస్తీర్ణంలో ప్రయోగాత్మక సాగు చేపట్టింది. ప్రస్తుతానికి ఈ వంగడం అభివృద్ధి దశలో ఉందని.. ఆమోదం లభించగానే పెద్ద ఎత్తున ఉత్పత్తి ప్రారంభమవుతుందని చెబుతున్నారు శాస్త్రవేత్తలు.

2-meter high rice plants
రెండు మీటర్ల వరి సాగు పరిశోధనలో నిమగ్నమైన శాస్త్రవేత్తలు

ఈ వరి రకంతో ఎకరం కంటే తక్కువ విస్తీర్ణంలోనే 800 కేజీల దిగుబడి వస్తుందని అంచనా వేస్తున్నారు. మొక్కలు పైకి ఎదుగుతాయి కాబట్టి.. పొలాల్లో చేపలను సైతం పెంచుకోవచ్చని సూచిస్తున్నారు శాస్త్రవేత్తలు. ఈ కొత్త రకంతో రైతుల ముఖాల్లో చిరునవ్వు వెల్లివిరుస్తుందంటున్నారు.

ప్రపంచంలోనే అతిపెద్ద వరి ఉత్పత్తిదారుగా ఉంది చైనా. ఆసియాలోనే అత్యధికంగా హెక్టారుకు 6.5-12 టన్నుల వరకు దిగుబడి సాధిస్తోంది. దాదాపు '49 సూపర్ రైస్' రకాలను అభివృద్ధి చేసింది. వీటిలో గోల్డెన్ షటిల్-1, జోంగ్యూ-1, 4, 6 వంటివి ముఖ్యమైనవి. అంతర్జాతీయ వరి పరిశోధన సంస్థ(IRRI), చైనీస్ అకాడెమిక్ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్ (CAAS) సహకారంతో మరిన్ని పరిశోధనలు చేపట్టనున్నట్లు తెలిపారు శాస్త్రవేత్తలు.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.