పాకిస్థాన్ కరాచీలో చాలా మంది హిందువులు నివసిస్తున్నారు. వీరిలో అనేక మంది పెళ్లి ఖర్చును కూడా భరించలేనంత పేదరికంలో ఉన్నారు. అలాంటి వారికి సాయం చేసేందుకు ముందుకు వచ్చింది పాకిస్థాన్ హిందు కౌన్సిల్. 80 పేద హిందూ జంటలకు ఆదివారం సామూహిక వివాహాలు జరిపించింది. పెళ్లి ఖర్చుతోపాటు కొత్త జంటలకు బంగారు ఆభరణాలు అందించింది పాక్ హిందూ కౌన్సిల్.
పాకిస్థాన్లో హిందువులు మైనార్టీలు. వారిలో ఎక్కువ మంది ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో చిన్నచిన్న ఉద్యోగాలు చేస్తుంటారు. అలాంటి తమకు ఇంత ఘనంగా వివాహం జరిపించడంపై కొత్త దంపతులు ఆనందం వ్యక్తంచేశారు.
ఇదీ చూడండి: ఆ చిన్నారి జ్ఞాపక శక్తికి అవార్డులు దాసోహం.. ఏడేళ్లకే డాక్టరేట్