వార్తల కోసం డబ్బులు చెల్లించేందుకు మూడు ఆస్ట్రేలియన్ వార్తా సంస్థలతో ప్రాథమికంగా ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఫేస్బుక్ శుక్రవారం ప్రకటించింది. సామాజిక మాధ్యమ సంస్థలు తమ ప్లాట్‌ఫామ్‌పై ప్రచురించే వార్తల కోసం.. సంబంధిత వార్తా సంస్థకు డబ్బులు చెల్లించాలనే బిల్లుకు ఆస్ట్రేలియా పార్లమెంట్ ఆమోదం తెలిపిన మరుసటి రోజే ఈ ఒప్పందం కుదరటం గమనార్హం.
ఇండిపెండెంట్ న్యూస్ ఆర్గనైజేషన్ ప్రైవేట్ మీడియా, స్క్వార్ట్జ్ మీడియా, సాలిస్టిస్ మీడియాతో రానున్న 60 రోజుల్లో పూర్తి స్థాయి వాణిజ్య ఒప్పదం కుదురుతుందని ఫేస్బుక్ వెల్లడించింది.
జర్నలిజంలో మరింత స్వతంత్రంగా ఉండేందుకు ఫేస్‌బుక్‌తో ఒప్పందం ఉపయోగపడుతుందని స్క్వార్ట్జ్ మీడియా పేర్కొంది.
ఇవీ చదవండి: