తూర్పు చైనా నగరంలో శుక్రవారం పిడుగులతో కూడిన వర్షం కురిసింది. వాతావరణంలో ఏర్పడిన మార్పుల వల్ల.. 11 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 100 మందికిపైగా గాయపడ్డారు. పెద్దఎత్తున గాలులు వీయగా.. అనేక భవనాలు, చెట్లు నేలకూలాయి. పలుచోట్ల కరెంట్ స్తంభాలు కూలిపోయి.. విద్యుత్ సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
ప్రమాదకర స్థాయిలో కురిసిన వర్షం ధాటికి.. జియాంగ్షులోని నాన్టాంగ్ నగరం తీవ్రంగా ప్రభావితమైంది. ఈ నేపథ్యంలో అక్కడున్న సుమారు 3,050 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టు స్థానిక అధికార యంత్రాంగం తెలిపింది. యాంగ్జే డెల్టా ప్రాంతంలో గంటకు 162 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయగా.. ఓ ఫిషింగ్ బోట్ బోల్తా పడింది. ఇద్దరు నావికులను రక్షించారు.
ఇదీ చదవండి: జపాన్‌లో 6.6 తీవ్రతతో భూకంపం