ETV Bharat / international

ఆర్మేనియా- అజర్​బైజాన్​ రగడపై భారత్​ వైఖరేంటి? - ఓఎస్​సీఈ మిన్స్క్ గ్రూప్

సరిహద్దులోని వివాదాస్పద నాగోర్నో-కరాబఖ్​ ప్రాంతంపై ఆధిపత్యం కోసం.. కొన్నిరోజులుగా ఘర్షణలతో హోరెత్తించాయి ఆర్మేనియా-అజర్​బైజాన్. దశాబ్దాలుగా రగులుతున్న వివాదానికి మరింత మంట రాజేసి.. కాల్పుల మోత మోగించాయి. ప్రస్తుతం ఈ ప్రాంతంలో కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకున్నా.. వివాదం పూర్తిగా సద్దుమణగలేదు. ఈ నేపథ్యంలో ఆర్మేనియాలో భారత మాజీ రాయబారి.. అచల్ మల్హోత్రా ఈ వివాదంలో భారత్​ వైఖరి గురించి ఈటీవీ భారత్​కు వివరించారు.

rmenia-Azerbaijan conflict
ఆర్మేనియా-అజర్​బైజాన్​ వివాదంపై.. భారత్​ వైఖరేంటి ?
author img

By

Published : Oct 16, 2020, 3:54 PM IST

ఆర్మేనియా క్రైస్తవ మెజార్టీ దేశం. అజర్​బైజాన్​ ముస్లిం మెజార్టీ దేశం. ఈ ఇరుదేశాల మధ్య నాగోర్నో-కరాబఖ్ వివాదం తీవ్ర ఘర్షణలకు దారితీసింది. ఇరు దేశాలు పరస్పర దాడులతో హడలెత్తించాయి. ప్రాంతంపై పట్టుకోసం దేశాలు ఘర్షణలకు తెగబడిన వేళ.. ప్రపంచ దేశాలు ఇరువర్గాలకు మద్దతుగా ముందుకొచ్చాయి. దాదాపు యుద్ధం జరిగే పరిస్థితులు తెలెత్తిన నేపథ్యంలో.. ఈ అంశంపై భారత్​ వైఖరేంటనేది ఆసక్తికరంగా మారింది.

ఈ వివాదంపై దక్షిణాసియా దేశాల అభిప్రాయాలు ప్రాధాన్యం సంతరించుకున్న పరిస్థితుల్లో.. భారత్ ఇరుగుపొరుగు దేశాలతో సమాన దూరం పాటిస్తోంది. ప్రాంతీయ శాంతి-భద్రతలకు ముప్పు కలిగించేలా.. తిరిగి మొదలైన ఆర్మేనియా-అజర్​బైజాన్​ ఘర్షణలపై దిల్లీ​ ఆందోళన వ్యక్తం చేసింది. ఇరుదేశాలు సరిహద్దులో శాంతి స్థాపనకు కృషి చేయాలని హితవు పలికింది. కాల్పుల విరమణ ఆవశ్యకత గుర్తుచేసింది.

ఈ నేపథ్యంలో.. ఆర్మేనియా-అజర్​బైజాన్​ మధ్య తీవ్ర ఘర్షణలకు దారితీసిన నాగోర్నో-కరాబఖ్ వివాదం గురించి, ఈ విషయంలో భారత్​ వైఖరి గురించి... ఆర్మేనియాలో భారత మాజీ రాయబారి అచల్ మాల్హోత్రా ఈటీవీ భారత్​ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

ఇదీ చూడిండి: యుద్ధమేఘాలు: ఆర్మేనియా- అజర్‌బైజాన్‌ వివాదమేంటి ?

నాగోర్నో-కరాబఖ్ వివాదం.. కొత్తగా పుట్టుకొచ్చింది కాదు. దశాబ్దాలుగా ఇరు దేశాల మధ్య అనేక ఘర్షణలకు కారణమైంది. నాడు యూఎస్ఎస్​ఆర్​లో భాగంగా ఉన్నప్పుడు అంతా ప్రశాంతంగానే ఉన్నా.. ఆ తర్వాతే వివాదాలు మొదలయ్యాయి. ఆ ప్రాంతం తమ భూభాగమే అంటోంది అజర్​​బైజాన్. స్వతంత్ర ప్రాంతమంటున్న వేర్పాటువాదులకు మద్దతిస్తోంది ఆర్మేనియా. ఈ వివాదం సమసిపోయే సూచనలు కనిపించటంలేదు.

ఆచితూచి అడుగులు..

రెండు దేశాలూ ఈ ప్రాంతంపై ఆధిపత్యం చెలాయించటమే లక్ష్యంగా అతివాద పోకడలు అవలంబిస్తున్న నేపథ్యంలో వివాదం మరింత హింసాత్మకంగా మారుతోందంటున్నారు అచల్​ మల్హోత్రా. అజర్​బైజాన్ నమ్మిన 'ప్రాదేశిక సమగ్రత సూత్రం' విధానానికి భారత్​ సహా అనేక దేశాలు మద్దతు తెలుపుతున్నాయని విశ్లేషిస్తున్నారు. అయితే స్థానిక డిమాండ్​ ప్రకారం.. ఈ ప్రాంతం స్వేచ్ఛకు ఆర్మేనియా పోరాడుతోందని, ఈ నేపథ్యంలోనే భారత్​ ఆచితూచి వ్యవహరిస్తోందని చెబుతున్నారు.

భారత్-ఆర్మేనియా సంబంధాలతో.. భారత్​-అజర్​బైజాన్​ బంధాన్ని పోలిస్తే ఆర్మేనియాతోనే బలమైన అవగాహన ఉంది.

-అచల్​ మల్హోత్రా, ఆర్మేనియాలో భారత మాజీ రాయబారి

కశ్మీర్​ సహా అనేక అంశాల్లో అంతర్జాతీయ వేదికలపై ఆర్మేనియా భారత్​కు మద్దతుగా నిలవగా.. ఆదే సమయంలో అజర్​బైజాన్,​ టర్కీతో కలిసి పాకిస్థాన్​వైపు నిలబడిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు మల్హోత్రా.

అయితే, భారత్​ ఆర్మేనియాకు బహిరంగా మద్దతు తెలపకపోవటానికి, అదే సమయంలో అజర్​బైజాన్ విధానాలకు వ్యతిరేకంగా ప్రకటనలు విడుదల చేయకపోవటానికి అనేక కారణాలున్నాయి. అంతర్జాతీయ వివాదాలపై భారత్ సంతులిత విధానాలనే అవలంబించింది. ఇటువంటి పరిస్థితుల్లో ఏ దేశంవైపు మద్దతుగా నిలబడకూడదనేది భారత విదేశాంగ విధానం. ప్రస్తుత పరిస్థితుల్లోనూ భారత్ తటస్థ వైఖరి అవలంబించింది.

ఈ నేపథ్యంలో అజర్​బైజాన్​కు మద్దతు ఇవ్వకుండా ఉండేందుకు భారత్​కు అనేక కారణాలున్నాయని ఆయన వివరించారు.

ప్రాదేశిక సమగ్రత సూత్రం అంటూనే.. భారత అంతర్గత అంశమైన కశ్మీర్​ అంశంలో పాకిస్థాన్​ వాదనకు మద్దతు తెలిపింది అజర్​బైజాన్. ఇది భారత్​కు ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదు. మరోవైపు భారత్ ఆర్మేనియాకు బాసటగా నిలవకపోవటానికి కారణం.. వేర్పాటువాదానికి మద్దతుగా నిలబడటం ఇష్టం లేకపోవటమే. ఎందుకంటే.. దేశంలో వేర్పాటువాదాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న భారత్... నైతికంగా బయటి దేశంలో ఇలాంటి చర్యకు మద్దతు తెలుపలేదు.

అదే సమయంలో శాంతి స్థాపన కోసం ఓఎస్​సీఈ మిన్స్క్ గ్రూప్ చేస్తున్న నిరంతర కృషిని భారత్​ కొనియాడిందని అచల్ మల్హోత్రా గుర్తు చేశారు.​ ఈ వివాదంలో టర్కీ సహా ఇతర దేశాల ప్రమేయానికి భారత్​ అనుకూలంగా లేదని వివరించారు.

భారత్​ దౌత్యబంధం..

మొత్తంగా, భారత్​పై ఈ వివాదం ప్రభావం పెద్దగా ఉండదని భావిస్తున్నారు పరిశీలకులు. ఆర్మేనియాలో భారత్​ పెట్టుబడలు పెద్దగా లేవు. వాణిజ్యం సైతం తక్కువగానే ఉంది. అజర్​బైజాన్​లో ఓఎన్​జీసీ చమురు ప్రాజెక్టులపై కొన్ని పెట్టుబడులు పెట్టింది. ఆ దేశం నుంచి భారత్​కు చమురు, గ్యాస్​ పంపిణీ చేసే పైప్​లైన్​ వ్యవస్థ ఉంది.

అదే సమయంలో ఇరు దేశాలతో భారత్​కు దౌత్యపరంగా సత్సంబంధాలే ఉన్నాయి. అంతేకాకుండా ఐరోపా, మధ్య ఆసియా దేశాలకు సరకులు రవాణా చేసే ఉత్తర-దక్షిణ నడవా ముంబయి, చాబహార్ నుంచి అజర్​బైజాన్​ మీదుగానే మాస్కో చేరుతుంది. అంతర్జాతీయ సంబంధాలకు ఇది భారత్​కు కీలకం.

మరోవైపు ఆ ప్రాంతంలో ఆర్మేనియా ఒక్కటే భారత్​ మిత్రదేశం. 1995లో కుదిరిన సహకార ఒప్పందం మేరకు.. అజర్​బైజాన్​కు భారత్​ ఎటువంటి సైనిక సహకారం అందించకూడదు. అలాగే ఆర్మేనియాతో భారత్​కు సాంస్కృతికంగా, చారిత్రకంగా బలమైన మైత్రి బంధం ఉంది.

ఇదీ చూడండి: ఆర్మేనియా- అజర్‌బైజాన్‌ల మధ్య శాంతి పవనాలు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.