టిబెట్‌లో ప్రవాసీ ప్రభుత్వం కోసం చివరి విడత సాధారణ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. భారత్ సహా మొత్తం 26 దేశాల్లో ఉన్న టిబెటన్లు తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. ధర్మశాల కేంద్రంగా ఉన్న ప్రవాసీ పార్లమెంటుకు సంబంధించి, తదుపరి అధ్యక్షుడిని ఎన్నుకునేందుకు ఈ ఎన్నికలు జరిగాయి.
సెంట్రల్ టిబెటన్ అడ్మినిష్ట్రేషన్ (సీటీఏ)లో మొత్తం 45 మంది సభ్యులు ఉండగా వారిని ఎన్నుకునేందుకు ఈ ఎన్నికలు జరిగాయి. మొత్తం 26 దేశాల్లో లక్షా 30వేల మంది టిబెటన్లు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నట్లు టిబెట్ ఎన్నికల కమిషనర్ చెప్పారు. ఈ ఎన్నికల ఫలితాలు మే 14న వెలువడనున్నాయి.
చివరి విడత ఎన్నికల్లో ఇద్దరు అభ్యర్థులు పెంపా సెరింగ్, ఆకాసంగ్ కెల్సాంగ్ డోర్జీ.. సీటీఏ ఛైర్మన్ పదవికి పోటీపడుతున్నారు. వీరిలో పెంపా సెరింగ్ ముందంజలో నిలిచారని తెలుస్తోంది.
విదేశాల్లో ఉన్న టిబెటన్లకు ప్రజాస్వామ్య పాలన అందించేందుకు 2011లో టిబెట్ పార్లమెంటు సీటీఏను ఏర్పాటు చేసింది. అంతకుముందు వరకూ బౌద్ధగురువు దలైలామా వారందరికీ లౌకిక అధిపతిగా ఉన్నారు.
ఇదీ చూడండి: 'టిబెట్‌లో చైనా జోక్యం తగదు.. ఆ దేశంలో స్వేచ్ఛ ఉండాల్సిందే'