ETV Bharat / international

దక్షిణ కొరియా మాజీ అధ్యక్షుడు కన్నుమూత

author img

By

Published : Oct 26, 2021, 12:37 PM IST

దక్షిణ కొరియా మాజీ అధ్యక్షుడు రోహ్​ తై​-వూ (Chun Doo Hwan Roh Tae Woo) మృతిచెందారు. ఈ విషయాన్ని సియోల్​ నేషనల్​ యూనివర్సిటీ ఆసుపత్రి యాజమాన్యం వెల్లడించింది.

south korea president
దక్షిణ కొరియా మాజీ అధ్యక్షుడు కన్నుమూత

దక్షిణ కొరియా మాజీ అధ్యక్షుడు రోహ్​ తై​-వూ (88) (Chun Doo Hwan Roh Tae Woo) కన్నుమూశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్రమంలో మంగళవారం తుదిశ్వాస విడిచినట్లు సియోల్​ నేషనల్ యూనివర్సిటీ ఆసుపత్రి వెల్లడించింది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న(Chun Doo Hwan Roh Tae Woo) తై వూ ఇటీవల ఆసుపత్రిలో చేరినట్లు తెలిపింది.

సైనిక తిరుగుబాటులో కీలక పాత్ర..

1979లో జరిగిన సైనిక తిరుగుబాటుకు తై​-వూ (Chun Doo Hwan Roh Tae Woo) మద్దతుగా నిలిచారు. ఆ సమయంలో ఓ దళానికి నాయకత్వం వహించడం సహా అతని స్నేహితుడు చున్​ దూ-వాన్​ను​ అధ్యక్షుడిని చేయడంలో కీలక పాత్ర పోషించారు. అయితే సైనిక పాలనపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడం వల్ల 1987లో ఎన్నికలు నిర్వహించి అధ్యక్ష పదవికి పోటీచేశారు. ఆ ఎన్నికల్లో గెలుపొందిన తై​-వూ అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టారు.

తై​-వూపై వ్యతిరేకత ఆయన అధ్యక్ష పదవిని వీడాక కూడా వెంటాడింది. ఫలితంగా ఆయన జైలు శిక్ష అనుభవించారు. అనంతరం ప్రభుత్వం నుంచి క్షమాభిక్ష పొంది జైలు నుంచి విడుదలైన వూ.. మిగిలిన జీవితాన్ని సమాజానికి దూరంగా ఉంటూ గడిపారు.

ఇదీ చూడండి : మసీదులో కాల్పులు.. 18 మంది దుర్మరణం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.