పాకిస్థాన్ చెరలో ఉన్న భారత నావికాదళ మాజీ అధికారి కులభూషణ్ జాదవ్‌ను సంబంధం లేని మరో కేసుతో ముడిపెడుతున్నారని భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీ వాస్తవ గురువారం మీడియాతో మాట్లాడారు.
"మహమ్మద్ ఇస్మాయిల్ అనే భారతీయుడు పాక్‌లో జైలు శిక్ష పూర్తి చేసుకున్నా ఇంకా విడుదల కాలేదు. అతన్ని భారత్‌కు అప్పగించాలన్న విషయమై వాదించేందుకు పాక్‌లోని భారత హైకమిషన్..షానజాన్ నూన్ను న్యాయవాదిగా నియమించింది. ఇస్లామాబాద్ హైకోర్టులో వాదనల సందర్భంగా ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేని జాదవ్ ప్రస్తావన తీసుకొచ్చారు. జాదవ్ తరఫున న్యాయవాది నియామకంపై భారత్ తన వైఖరి చెప్పాలనుకుంటోందంటూ షానవాజ్ ప్రకటించారు. పాక్ అధికారుల ఒత్తిడి మేరకే అతనిలా మాట్లాడినట్టు తెలుస్తోంది"
--- విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీ వాస్తవ
గూఢచర్యం ఆరోపణలతో జాదవ్‌కు పాక్ కోర్టు మరణశిక్ష విధించగా..అంతర్జాతీయ న్యాయస్థానం జోక్యంతో శిక్ష నిలిపివేసిన విషయం తెలిసిందే.
ఇదీ చదవండి: హఫీజ్ అధికార ప్రతినిధికి 15 ఏళ్ల జైలు శిక్ష