ETV Bharat / international

'భారత్​కు 4వేల మందికిపైగా మయన్మార్​ శరణార్థులు' - myanmar refugees to india

మయన్మార్​ నుంచి నాలుగు వేల మందికిపైగా ప్రజలు భారత్​కు శరణార్థులుగా వచ్చారని ఐక్యరాజ సమితి పేర్కొంది. 60వేల మందికిపైగా మయన్మార్​ వాసులు ఇతర దేశాలకు శరణార్థులుగా వెళ్లారని తెలిపింది.

myanmar refugees to india, india myanmar borders
భారత్​కు మయన్మార్​ శరణార్ఖులు
author img

By

Published : May 20, 2021, 11:01 AM IST

మయన్మార్​లో నెలకొన్న అనిశ్చితి కారణంగా 4000 నుంచి 6000 మంది భారత్​కు శరణార్థులుగా వెళ్లినట్లు ఐక్యరాజ సమితి అంచనా వేసింది. గత వారం వరకు సుమారు 60,700 మంది ప్రజలు ఇతర దేశాల్లో ఆశ్రయం కోసం దేశ సరిహద్దు ప్రాంతాలకు తరలి వెళ్లారని తెలిపింది.

1,700 మందికిపైగా శరణార్థులు సరిహద్దు దాటి థాయ్​లాండ్​ చేరుకున్నారని.. అయితే వారిలో అనేక మంది మయన్మార్​కు తిరిగి వచ్చారని ఐక్యరాజ సమితి ప్రకటనలో పేర్కొంది.

ఆదుకోండి

మయన్మార్​లో జరుగుతున్న హింస నేపథ్యంలో శరణార్థులకు ఆశ్రయం కల్పించాలని యూఎన్​ ఇప్పటికే పిలుపునిచ్చింది. శరణార్థులకు సాయం అందించేందుకు సామాజిక కార్యకర్తలను అనుమతించాలని సూచించింది.

ఇదీ చదవండి : 'భారత్​కు అమెరికా 500 మిలియన్​ డాలర్ల సాయం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.