ETV Bharat / international

'భారత్​-చైనా ఉద్రిక్తతలతో యూరేషియాలో అస్థిరత'

భారత్, చైనా మధ్య సరిహద్దు ఉద్రిక్తతలు పెరిగితే ఆసియా-ఐరోపా ప్రాంతంలో అస్థిరతకు దారితీస్తాయని రష్యా హెచ్చరించింది. భౌగోళిక ప్రయోజనాల కోసం ఇతర శక్తులు ఈ అవకాశంగా ఉపయోగించుకుంటాయని పేర్కొంది. రెండు దేశాలు నిర్మాణాత్మక చర్చల ద్వారా విభేదాలను పరిష్కిరించుకోవాలని సూచించింది.

SINOINDIA-RUSSIA
భారత్, చైనా
author img

By

Published : Nov 12, 2020, 2:39 PM IST

ప్రపంచంలో అనిశ్చితి నెలకొన్న వేళ భారత్, చైనా మధ్య సరిహద్దు ఘర్షణలు జరిగితే యూరేషియాలో ప్రాంతీయ అస్థిరత మరింతగా పెరుగుతుందని రష్యా పేర్కొంది. వీటిని ఆసరాగా తీసుకుని భౌగోళిక రాజకీయ ప్రయోజనాల కోసం ఇతర ప్రాంతీయ శక్తులు దుర్వినియోగం చేసే అవకాశం ఉందని హెచ్చరించింది.

ఆసియాలోని రెండు పెద్ద దేశాల మధ్య ఉద్రిక్తతల విషయంలో సహజంగానే ఆందోళన పడుతున్నామని రష్యా తెలిపింది. విభేదాల విషయంలో రెండు దేశాలు నిర్మాణాత్మక చర్చలు జరపాలని సూచించారు రష్యా మిషన్​ డిప్యూటీ చీఫ్ రోమన్​ బాబష్కిన్. బ్రిక్స్, ఎస్​సీఓలో సభ్యదేశాలపై భారత్, చైనా.. బహుళపాక్షిక విధానంలో సహకారాన్ని పెంచుకోవాలని సూచించారు.

తూర్పు లద్దాఖ్​ సరిహద్దుల్లో భారత్, చైనా మధ్య కొన్ని నెలలుగా ప్రతిష్టంభన నెలకొంది. ప్రస్తుతం ఉద్రిక్తతలు తలెత్తిన ప్రాంతాల నుంచి బలగాల ఉపసంహరణ కోసం రెండు దేశాలు చర్చల ద్వారా ప్రయత్నిస్తున్నాయి.

ఇదీ చూడండి: ఇండో-పసిఫిక్ దేశాధినేతలతో బైడెన్ కీలక చర్చలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.