ETV Bharat / international

విమానాశ్రయంపై డ్రోన్ దాడులు.. ఉలిక్కిపడ్డ ప్రజలు

డ్రోన్ దాడులతో ఇరాక్​లోని (Iraq drone attack) ఇర్బిల్ అంతర్జాతీయ విమానాశ్రయం ఉలిక్కిపడింది. రెండు నెలల విరామం తర్వాత ఇరాక్​లో దాడులు జరిగాయి. ఇరాన్ మద్దతు ఉన్న ఉగ్రవాదులే ఈ దాడులు చేసి ఉంటారని సమాచారం.

iraq drone attack
ఇరాక్ ఎయిర్​పోర్ట్
author img

By

Published : Sep 12, 2021, 8:35 AM IST

పేలుడు పదార్థాలతో కూడిన డ్రోన్లు ఇరాక్​లోని ఇర్బిల్ అంతర్జాతీయ విమానాశ్రయంపై దాడి (Iraq drone strikes) చేశాయి. కనీసం రెండు డ్రోన్లు వచ్చినట్లు కుర్దిస్థాన్ కౌంటర్ టెర్రరిజం సర్వీస్ వెల్లడించింది. దాడి వల్ల ప్రాణనష్టం సంభవించలేదని తెలిపింది.

విమానాశ్రయం బయట పేలుడు (Erbil international airport) జరిగిందని ఇక్కడి ప్రాంత ప్రతినిధి లాక్ ఘఫురీ తెలిపారు. దీనివల్ల విమానాల రాకపోకలకు అవాంతరాలు ఎదురయ్యాయన్న వార్తలను ఖండించారు. ఎయిర్​పోర్ట్​లో కార్యకలాపాలు యథాతథంగా సాగుతున్నాయని చెప్పారు. పేలుడు ఘటనపై దర్యాప్తు జరుగుతోందని స్పష్టం చేశారు.

కనీసం మూడుసార్లు పేలుడు శబ్దాలు వినిపించాయని ప్రత్యక్ష సాక్షులు పేర్కొన్నారు. ఓ డ్రోన్​ పేలుడు తర్వాత ధ్వంసం కాగా.. మరొకదాన్ని బలగాలు కాల్చాయని స్థానిక మీడియా తెలిపింది.

గ్యాప్ తర్వాత...

రెండు నెలల విరామం తర్వాత ఈ దాడులు జరగడం గమనార్హం. జులై 8న బాగ్దాద్​లోని పటిష్ఠమైన గ్రీన్​ జోన్​లో (Baghdad rockets Green Zone) రాకెట్ దాడులు జరిగాయి. అమెరికా రాయబార కార్యాలయం సైతం ఇక్కడే ఉంది. ఈ ఘటనలో స్వల్పంగా ఆస్తినష్టం సంభవించింది. ఎవరికీ గాయాలు కాలేదు.

ఇరాక్ మద్దతు ఉన్న ఉగ్రవాదులే ఈ దాడులకు తెగబడుతున్నారని అమెరికా ఆరోపిస్తోంది. ఇంతవరకు, సాధారణ రాకెట్లతో దాడి చేస్తున్న ఈ ఉగ్రవాదులు.. ఇటీవల అధునాతన డ్రోన్లను ఇందుకు వినియోగిస్తున్నారు.

ఇరాక్​లో ఐసిస్​పై పోరాటం చేస్తున్న అమెరికా (US in Iraq).. త్వరలో తన యుద్ధాన్ని ముగించనుంది. ఈ ఏడాది చివరి నాటికి సాయుధ మిషన్ నుంచి తప్పుకోనుంది. ప్రస్తుతం 2500 మంది అమెరికా జవాన్లు స్థానిక బలగాలకు సహకారం అందిస్తున్నాయి. ఇస్లామిక్ స్టేట్ గ్రూప్​లో (US ISIS war) మిగిలిన సభ్యులను వీరు ఎదుర్కొంటున్నారు.

ఇదీ చదవండి: 'దేశ నాయకుడు మూర్ఖుడిలా కనిపించారు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.