ETV Bharat / international

'నిర్మానుష్య ప్రదేశాల ద్వారా ఉగ్రవాదుల చొరబాటు' - నియంత్రణ రేఖ

దాదాపు 60మంది ఉగ్రవాదులు సరిహద్దు​లోని నిర్మానుష ప్రదేశాల నుంచి దేశంలోకి చొరబడినట్టు అధికారులు తెలిపారు. అయితే ఈ విషయాన్ని భారత్​ సైన్యం ఇంకా ధ్రువీకరించలేదు.

నిర్మానుష ప్రాంతాల ద్వారా భారీగా చొరబడిన ఉగ్రమూక
author img

By

Published : Sep 17, 2019, 10:00 PM IST

Updated : Oct 1, 2019, 12:12 AM IST

జమ్ముకశ్మీర్​కు స్వయం ప్రతిపత్తిని తొలిగించిన​ నాటి నుంచి దాదాపు 60మంది ఉగ్రవాదులు.. నిర్మానుష ప్రదేశాల ద్వారా దేశంలోకి అక్రమంగా చొరబడినట్లు అధికారులు తెలిపారు. ఇందుకు పాక్​ సైన్యం.. ఉగ్రవాదులకు సహాయం చేసినట్టు వెల్లడించారు.

ఉత్తర కశ్మీర్​, పూంచ్​, రాజౌరీ ప్రాంతాల్లో ఉగ్రవాదుల చొరబాటు ఘటనలు భారీగా పెరిగాయని నిఘా వ్యవస్థ సమాచారం అందించిన తరుణంలో.. అధికారులు ఈ విషయాన్ని వెల్లడించడం కలవరపరుస్తోంది. అయితే ఉగ్రవాదుల చొరబాటుపై భారత్​ సైన్యం ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు.

చొరబాటు ఘటనలను నిర్ధారించేందుకు ఇటీవలే ఓ సమావేశం జరిగింది. గురెజ్​, మచిల్​, గుల్​మార్గ్​, పూంచ్​, రాజౌరీ ప్రాంతాల్లో జరిగిన చొరబాటు ఘటనలకు సంబంధించిన ఆధారాలను.. భేటీకి హాజరైన ఓ సైన్యాధికారికి వివిధ భద్రతా సంస్థలు అందించాయి.

నిర్మానుష ప్రాంతాల నుంచి ఉగ్రవాదుల చొరబాటు జరిగిందన్న విషయంపై విచారణ జరపుతున్నట్టు జమ్ముకశ్మీర్​ డీజీపీ దిల్​బగ్​ సింగ్​ తెలిపారు.

1990ల్లో కశ్మీర్​లోకి చొరబడేందుకు గుల్​మార్గ్​లోని ఎత్తైన ప్రాంతాలను వినియోగించేవారు ఉగ్రవాదులు. అనంతరం భారత్​ సైన్యం అక్కడ నిఘాను పెంచి ఉగ్రవాదుల చొరబాటును నియంత్రించింది. ఈ మార్గాన్నే తాజాగా చొరబాటుకు ఉగ్రవాదులు అనేక మార్లు ఉపయోగించి ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఎదురుకాల్పుల ముసుగులో ముష్కరులు గురెజ్, మచిల్​, తంగ్​ధార్​ ప్రాంతాల్లోకి ప్రవేశించి ఉండవచ్చన్నారు. గండర్​బల్​ ప్రాంతంలో కనపడుతున్న కొత్త వారిని దృష్టిలో పెట్టుకుని ఉగ్రవాదుల చొరబాటు జరిగిందని అధికారులు విశ్వసిస్తున్నారు.​

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Hokkaido, Sapporo, Japan. 16th September 2019.
+++CLIENTS PLEASE NOTE: VIDEO AS INCOMING+++
Tokyo to Sapporo, Japan.
1. 00:00 Tongan Rugby World Cup squad break into harmonised singing after landing in Hokkaido, Sapporo
Hokkaido, Sapporo, Japan.
2. 00:32 Tongan players continue singing in Hokkaido training camp
SOURCE: Tonga Media
DURATION: 00:57
STORYLINE:
The Tongan Rugby World Cup squad delighted fellow passengers on board a flight to Hokkaido in Sapporo, Japan, when they broke out into harmonised singing after landing on Monday ahead of their first World Cup match against England on Sunday.
The singing continued as the Tongan squad settled into their base in Hokkaido ahead of the England match.
France, Argentina and the United States of America complete Pool C of the Rugby World Cup.
Last Updated : Oct 1, 2019, 12:12 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.