అఫ్గానిస్థాన్‌ను తాలిబన్లు(Afghanistan Taliban ఆక్రమించుకున్న తర్వాత.. అక్కడి ప్రజలు దయనీయ పరిస్థితుల్లో కాలం వెళ్లదీస్తున్నారు. ఆహారం దొరకక చాలా మంది పస్తులు ఉంటున్నారు. మరికొంతమంది అనారోగ్యం బారినపడి, వైద్యం చేయించుకునేందుకు సరిపడా డబ్బులు లేక సతమతమవుతున్నారు. ఓ మహిళ.. తన 13 ఏళ్ల కూతురి వైద్యం కోసం తన ఏడాదిన్నర వయసు చిన్నారిని అమ్మేసింది. ఈ మేరకు 'టోలో న్యూస్' ఓ కథనం ప్రచురించింది.
30 వేల కోసం
"బగ్లాన్కు చెందిన లైలుమా భర్త ఏడాది నుంచి కనిపించడం లేదు. బగ్లాన్ను తాలిబన్లు(Afghanistan Taliban ఆక్రమించుకున్న తర్వాత కాబుల్‌కు చేరుకున్న లైలుమా.. అక్కడే శిబిరాల్లో నివసిస్తోంది. అనారోగ్యం బారినపడిన తన 13 ఏళ్ల కుమార్తెకు వైద్యం కోసం.. గత్యంతరం లేని పరిస్థితుల్లో 30వేల కోసం ఓ వ్యక్తికి తన చిన్నారిని అమ్మేసింది"అని 'టోలో న్యూస్' తన వార్తా కథనంలో తెలిపింది.
తీవ్ర ఇబ్బందులు..
అఫ్గాన్‌లోని వివిధ ప్రాంతాల నుంచి వలస వచ్చిన ఎన్నో కుటుంబాలు... కాబుల్‌లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. శీతాకాలం కారణంగా వారి పిల్లలు అనారోగ్యం బారిన పడుతున్నారు. తమకు తాలిబన్ శరణార్థి శాఖ నుంచి ఎలాంటి సాయం అందడం లేదని వారంతా వాపోతున్నారు.
"అఫ్గాన్ శరణార్థి శాఖకు చెందిన సిబ్బంది వచ్చి ఇక్కడ ఎంత మంది ఉన్నారని సర్వే చేసి వెళ్లారు. కానీ, మాకు ఇప్పటివరకు ఎలాంటి సాయం అందించలేదు. ఇదే పరిస్థితి కొనసాగితే.. మేం ఆకలితో మాడి చచ్చిపోతాం" అని కాబుల్‌లో శిబిరాల కింద నివసిస్తున్న ఆయిషా ఆవేదన వ్యక్తం చేశారు.
అఫ్గాన్‌ను తాలిబన్లు ఆక్రమించుకున్నాక వేలాది కుటుంబాలు... కాబుల్‌లోని శరణార్థి శిబిరాలకు చేరుకున్నాయి. అక్కడే నివసిస్తూ కాలం వెళ్లదీస్తున్నాయి.
ఇవీ చూడండి: